కథా శతక పద్యం

25 Sep, 2017 00:45 IST|Sakshi

‘నన్ను పట్టి కుదిపిన ఒక సంఘటనను చిన్నకథగా రాసాను. అలాంటి కథా సారాంశంతో కూడిన వేమన పద్యం ఒకటి నాకు యాది కొచ్చింది. ఇంకేం? కథ కింద పద్యం ఉంచాను. వేమన పద్యంలో మూడవ పాదం మార్గదర్శి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కనుక ఆ పాదంలోని ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాను. అలా ఒక కొత్త రూపం పురుడు పోసుకుంది’ అని ‘కశప’ నేపథ్యం చెబుతారు బి.వి.ఎన్‌.స్వామి. అలా 117 చిన్న కథలు రాశారు. వాటికి, మల్లికార్జున పండితారాధ్యుని ‘శివతత్త్వసారము’, పాల్కురికి సోమన ‘వృషాధిప శతకము’, బమ్మెర పోతన ‘నారాయణ శతకం’, ధూర్జటి ‘కాళహస్తీశ్వర శతకం’, కుసుమ ధర్మన్న ‘హరిజన శతకం’, శ్రీశ్రీ ‘సిరిసిరిమువ్వ శతకం’లాంటి వాటితోపాటు నేడు రాస్తున్న పద్య కవుల రచనల్లోని పద్యాలను జత చేశారు. ఒక పద్యానికి కథ రాయడం కాదు; ఒక కథ రాసి దానికి అనుగుణమైన భావం గల పద్యాన్ని యావత్‌ తెలుగు సారస్వతంలో గాలించడం! ఇదొక ప్రయోగం. ఇందులోని సాహిత్య ప్రయోజనం కన్నా రచయిత పడిన శ్రమ గమనించదగ్గది.

మరిన్ని వార్తలు