కటార్‌మల్ సూర్య దేవాలయం

8 Mar, 2016 23:20 IST|Sakshi
కటార్‌మల్ సూర్య దేవాలయం

సందర్శనీయం
 
మన దేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదు. వాటిలో కూడా కొద్ది ఆలయాల గురించి మాత్రమే అందరికీ తెలుసు. తెలియని వాటిలో ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా జిల్లా మారుమూల గ్రామమైన కటార్‌మల్‌లో ఉన్న పురాతన సూర్య దేవాలయం ఒకటి. సముద్ర మట్టానికి ఏకంగా 2,116 మీటర్ల ఎత్తులో వెలసిన ఆలయం ఇది. అల్మోరాకు 12 కిలోమీటర్ల దూరంలో, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నైనితాల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటారమల్లుడనే రాజు ఈ ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించాడు.

ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఆలయం, లక్ష్మీనారాయణుల ఆలయం సహా 44 చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని ఒక పురాతన విగ్రహం చోరీకి గురి కావడంతో ఆలయానికి గల కలప ద్వారబంధాలు, ఇతర ముఖ్యమైన నిర్మాణాలను, శిల్పాలను ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు తరలించారు.
 

మరిన్ని వార్తలు