కేరళ వంగ భలే రుచి..!

5 Mar, 2019 04:33 IST|Sakshi
కంటెయినర్‌లో నవనవలాడుతున్న వెంగెరి వంకాయలు

ఇది ఎంతో రుచికరమైన వంగ రకం. దీని పేరు వెంగెరి వంగ. కాయ సన్నగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ‘అమితాబ్‌ బచ్చన్‌’ వంగ రకం అని చమత్కరిస్తుంటారు. హైదరాబాద్‌ మెహదీపట్నానికి చెందిన ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళిని తన మేడపై ఐదారు రకాల వంకాయలను సాగు చేసుకుంటున్నారు. 15“15 అంగుళాల సైజులోని మూడు కంటెయినర్లలో వెంగెరి రకం వంగ మొక్కలను ఆమె పెంచుతున్నారు. ఆరోగ్యంగా, పొడవుగా పెరిగిన ఈ వంకాయలు ఆమె ఇంటిపంటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది కేరళకు చెందిన దేశీ వంగ రకమని, కొన్నాళ్ల క్రితం బెంగళూరులో ఇంటిపంటల సాగుదారుల విత్తన మార్పిడి సమావేశంలో పాల్గొన్నప్పుడు ఎవరో తనకు ఈ విత్తనాలు ఇచ్చారని నళిని తెలిపారు. కొన్ని కాయలను విత్తనాలకు ఉంచి, బంధుమిత్రులకు పంపిణీ చేస్తానని ఆమె అన్నారు.
 

మరిన్ని వార్తలు