నవంబర్‌ 10, 11 తేదీల్లో డా. ఖాదర్‌వలి సభలు

29 Oct, 2019 07:21 IST|Sakshi

నారాయణపేట, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో సభలు

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలు, సిరిధాన్యాల సాగు పద్ధతులపై రైతులోకం ఫౌండేషన్, తెలంగాణ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 10 (ఆది వారం) ఉ. 10 గం. నుంచి మ. 2 గం. వరకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం నారాయణపేటలోని జీపీ శెట్టి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే సదస్సులో ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి (మైసూరు) ప్రసంగిస్తారు. వివరాలకు.. జె.సి.ఎం. – 93965 84805. 
అదేరోజు సా. 4 గం. నుంచి 7 గం. వరకు నాగర్‌కర్నూల్‌లో మార్కెట్‌ యార్డు (కలెక్టర్‌ ఆఫీసు ఎదురుగా) జరిగే సభలో డా. ఖాదర్‌ ప్రసంగిస్తారు. వివరాలకు.. నవీన్‌ – 90522 22244. 
నవంబర్‌ 11(సోమవారం)న మధ్యాహ్నం 2 గం. నుంచి సా. 5 గం. వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాల్మకుల్‌ గ్రామంలోని స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగే సభలో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. రాజ్‌ భూపాల్‌ – 90901 29999. ప్రొఫెసర్‌ (డా.) డి. రామ్‌కిషన్‌– 94407 12021, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి – 99638 19074. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. 

3న ఆదిలాబాద్, 4న కొత్తపేట(హైదరాబాద్‌)లో..
ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సహకారంతో నవంబర్‌ 3 (ఆదివారం) ఉ. 10 గం. నుంచి ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా, 4(సోమవారం)న సా. 4 గం. నుంచి 7 గం. వరకు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద కొత్త పేటలోని బాబూ జగ్జీవన్‌రాం హాల్‌ (రైతు బజార్‌ పక్కన)లో జరిగే సదస్సులో డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 70939 73999, 96767 97777.

1న తిరుపతిలో సిరిధాన్యాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం
సిరిధాన్యాలు సాగు చేస్తున్న రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలపై చర్చిం చేందుకు భార తీయ కిసాన్‌ సంఘ్, ఆం.ప్ర. గోఆధారిత వ్యవ సాయదారుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 1వ తేదీ(శుక్రవారం)న తిరు పతిలోని యూత్‌ హాస్టల్‌ (ముత్యాలరెడ్డి పల్లి)లో ఉ. 10 గం. నుంచి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగనుంది. సిరిధాన్యాలు సాగు చేసే రైతుల సమస్యలను క్రో డీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్క రింపజేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీకేఎస్‌ నేత కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. గంగాధర్‌ – 98490 59573. 

3న మేలైన పశుగ్రాసాల సాగుపై కొర్నెపాడులో శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో నవంబర్‌ 3వ తేదీ(ఆదివారం)న ఉ.10 గం. నుంచి సా. 4 గం. వరకు సూపర్‌ నేపియర్‌ తదితర మేలైన పశుగ్రాసాల సాగుపై గన్నవరం పశువైద్యకళాశాల ప్రొఫెసర్‌ డా.సి.హెచ్‌. వెంకటశేషయ్య, పాడి రైతు విజయ్‌ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారని ఫౌం డేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపా రు. సూపర్‌ నేపియర్‌ కణుపులు కొన్నిటిని శిక్షణ పొందే రైతులకు పంపిణీ చేస్తామన్నారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255.

3న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సీజనల్‌ పంటలు, పండ్లతోటల సాగుపై నవంబర్‌ 3వ తేదీ (ప్రతి నెలా మొదటి ఆదివారం)న అనంతపురం జిల్లా సికెపల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో రైతులకు సీనియర్‌ ప్రకృ తి వ్యవసాయదారుడు నాగరాజు శిక్షణ ఇస్తారు. 
ఉ. 9 గం. నుంచి  సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. రుసుము రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349.  

మరిన్ని వార్తలు