పిల్లల క్యాజువల్ వేర్...

8 Sep, 2016 23:00 IST|Sakshi
పిల్లల క్యాజువల్ వేర్...

చంటిపిల్లలకు ఎన్ని డ్రెస్సులున్నా సరిపోవు. క్యాజువల్ వేర్‌గా ఇంట్లో వేసే పైజామాలు, నైట్ డ్రెస్సులైతే ఎప్పుడూ వెతుక్కోవాల్సిందే! పెద్దవాళ్ల లాంగ్ స్లీవ్స్ షర్ట్‌లు, టీ షర్ట్‌లు, పైజామాలను ఇలా పిల్లలకు

ఉపయోగపడేలా తయారుచేసుకోవచ్చు. కొత్తగానూ వెరైటీగానూ అనిపించే ఈ డిజైనింగ్ ఈ వారం...

రెండు మూడేళ్ల పిల్లలకు ఇంట్లో వేయదగిన డ్రెస్సుల సిద్ధం చేయాలంటే ఎంతో ఖర్చుపెట్టాల్సిన

అవసరం లేదు. పెద్దవాళ్ల షర్టులు, టీషర్టులు ఉంటే చాలు వాటిలో....

కొత్తగా ఉండి ఉపయోగించని పొడవాటి చేతులున్న టీ షర్ట్ లేదా స్వెటర్ తీసుకోవాలి. చేతుల భాగాన్ని భుజాల దగ్గర కట్ చేయాలి. పిల్లల నడుము నుంచి పాదాల వరకు కొలత తీసుకొని అంతమేరకు చాప్‌స్టిక్‌తో మార్క్ చేసుకోవాలి. తర్వాత రెండు చేతుల భాగాన్ని ఫొటోలో చూపిన విధంగా జత చేయాలి.

షర్ట్స్ చేతుల భాగాన్ని కూడా ఇలాగే తయారుచేసుకోవచ్చు.

పెద్దవాళ్ల షర్ట్స్, ప్యాంట్స్ పాకెట్స్‌ని కత్తిరించి పిల్లల పైజామాలకు జత చేస్తే అవి కొత్తవాటిలా కనిపిస్తాయి.

పెద్దవాళ్ళ పైజామా ఉపయోగంలో లేకుండా ఉంటే ఇలా చిన్నపిల్లలకు క్యాజువల్ వేర్‌గా సిద్ధం చేయవచ్చు.

షర్ట్ కింది సగభాగాన్ని స్కర్ట్‌గానూ, చేతుల భాగాన్ని పైజామాగానూ ఉపయోగించవచ్చు.

మరిన్ని వార్తలు