ముద్దుల మిస్సమ్మలు

21 Jan, 2017 00:32 IST|Sakshi


వావ్! వీళ్లలో ఎవరండీ మిస్‌ యూనివర్స్‌?! క్వొశ్చన్‌ నాట్‌ కరెక్ట్‌. వీళ్లలో మిస్‌ యూనివర్స్‌ కానిదెవరో చెప్పండి! నో కంటెస్టెంట్స్‌. ఓన్లీ విన్నర్స్‌. ఎలా సాధ్యం? ఇంతమంది విన్‌ అవడం?


ఎవరో ఒకరికే కదా మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ దక్కుతుంది. అది కూడా ఊరికే దక్కుతుందా? గ్రూప్‌ ఎగ్జామ్స్‌లో ఉన్నట్లు ప్రిలిమ్స్‌ ఉంటాయి. మెయిన్స్‌ ఉంటాయి. సెమీ ఫైనల్స్‌ ఉంటాయి. ఫైనల్స్‌ ఉంటాయి. వాటికన్నా ముందు ‘స్విమ్‌ సూట్‌’ రౌండ్‌లు ఉంటాయి. ‘నైట్‌ గౌన్‌’ పరేడ్‌లు ఉంటాయి. మళ్లీ జడ్జీల ఇంటర్వూ్యలు ఉంటాయి. ఫైనల్‌గా 15 మంది నుంచి ఐదుగురిని, ఐదుగురి నుంచి ముగ్గురిని, ముగ్గురి నుంచి ఒక్కరిని జడ్జీలు ఎంపిక చేస్తారు. ఇంత ప్రాసెస్‌ ఉండగా, పుసుక్కున్న వీళ్లందరినీ ‘మిస్‌ యూనివర్స్‌లు’ అనేస్తే ఎలా అనే కదా మీ డౌట్‌!

నిజమే. ఈ ఏడాది ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం కోసం 85 మంది అందాల రాణులు పోటీలో ఉన్నారు. ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న ఫైనల్స్‌కి వెళ్లే ఆ ముగ్గురు ఎవరో, ఆ ముగ్గురిలో ఆ ఒక్కరు ఎవరో తేల్చడం ఎలాగో అని జడ్జీలు ఆల్రెడీ కళ్లు తేలేశారట. అంత టఫ్‌గా నడుస్తోంది పోటీ.

మరి ఈ చిన్నారి బ్యూటీలు ఎవరు? పెళ్లిలో తోడి పెళ్లికూతురిలా, అందాల పోటీలకు నిండుదనం తెచ్చే తోడి అందాల సుందరులా? అంతకన్నా ఎక్కువే. వీళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క అందాల కిరీటం. వీళ్లలో ఎవరితో కలిసి మీరు సెల్ఫీ తీసుకున్నా... పోటీ లేకుండా మీరు ‘మిస్‌ యూనివర్స్‌’ టైటిల్‌ కొట్టేసినట్టే. (బిడ్డను ఎత్తుకుని నిలబడిన తల్లికి మంచిన మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్‌.. ఎక్కడైనా ఉంటారా! అలాగన్నమాట).

ఇంతకీ.. మిస్‌ యూనివర్స్‌ పోటీలకు అన్నట్లుగా తయారై బస్సు ఎక్కబోతున్న ఈ చిన్నారులు వెళుతున్నది ఎక్కడికో తెలుసా? ఇప్పటికే  ఫిలిప్పీన్స్‌ చేరుకుని ఉన్న అందాల అతిథులకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పడానికి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా