కిచెన్ టిప్స్

9 May, 2015 23:52 IST|Sakshi
కిచెన్ టిప్స్

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చెంచాడు నూనెను వేడిచేసి అందులో కలపాలి.చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి, కొద్దిగా వెనిగర్ చల్లి ఫ్రీజర్‌లో పెట్టాలి.బంగాళదుంప ముక్కలు త్వరగా వేగాలంటే... వాటిని ఇరవై నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి, తీసి ఆరబెట్టి, తర్వాత వేయించాలి.అప్పడాలు, వడియాలు, పూరీల వంటివి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే... వేయించేముందు నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి.

పుట్టగొడుగుల్ని శుభ్రం చేయాలంటే ముందు తడి బట్టతో కానీ, బ్రష్‌తో కానీ శుభ్రం చేసి... తర్వాత ఓసారి నీటిలో ముంచి తీసేయాలి. అలా కాకుండా నీటిలో వేసి కడిగితే అవి త్వరగా నీళ్లు పీల్చేసుకుంటాయి. వాటి రుచి, పోషకాలు తరిగిపోతాయి.
 
 

మరిన్ని వార్తలు