ఫ్రాక్చర్‌ లేకపోయినా నొప్పి తగ్గడం లేదు

13 Jan, 2020 02:35 IST|Sakshi

ఆర్థోపెడిక్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 25 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. నొప్పి ఎంతగా ఉంటోందంటే ఒక్కోసారి అస్సలు దానిపై భారం వేయలేకపోతున్నాను. కాలు కింద పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్‌ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.

ఫ్రాక్చర్‌ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్‌ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్‌–రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్‌ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్‌ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో  భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను సంప్రదించండి.

>
మరిన్ని వార్తలు