అదనపు ఆదాయం .. ఇలా ఉపయోగిద్దాం..!

22 Oct, 2014 00:01 IST|Sakshi
అదనపు ఆదాయం .. ఇలా ఉపయోగిద్దాం..!

కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బోనస్‌లో, జీతాల పెంపు రూపంలోనో లేదా మరో రూపంలో వచ్చే అదనపు ఆదాయాన్ని సద్వినియోగపర్చుకోవచ్చు. పొదుపు మొత్తాన్ని పెంచండి: జీతంలో ఇంత మొత్తం అని కాకుండా ఇంత శాతాన్ని పొదుపు చేయాలని నిర్దేశించుకుంటే దానికి తగ్గట్లుగా ఖర్చులను నియంత్రించుకోవచ్చు. భవిష్యత్ కోసం జాగ్రత్తపడొచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్: అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇప్పటిదాకా ఇలాంటి ఏర్పాటు చేసుకోకపోతే.. కొత్తగా చేతికొచ్చే అదనపు ఆదాయాన్ని ఇందుకోసం ఉపయోగించండి. మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, మీ వయస్సు, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇందులో ఉంచడం మంచిది.

అప్పులుంటే తీర్చేయండి: అప్పుల భారం మోయగలిగే స్థాయిని మించి ఉంటే.. ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. పెపైచ్చు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంటే భారం మరింత పెరిగిపోతుంది. కాబట్టి..  ముందుగా అప్పులను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన దానిని  ప్రయోజనకరమైన పెట్టుబడులకు మళ్లించవచ్చు.
 ఇన్వెస్ట్‌మెంట్: స్టాక్‌మార్కెట్లు, వాటి అనుబంధ సాధనాల్లో  ఇన్వెస్ట్ చేసేందుకు పరిజ్ఞానం లేనివారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. నెలకు రూ. 500 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా