హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ చేయాలిలా!!

15 Apr, 2015 03:57 IST|Sakshi
హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ చేయాలిలా!!

ఆడవారికి అత్యవసరమైపోయిన వస్తువుల్లో హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమైనది. ఒకప్పుడు అవసరమైన వస్తువుల్ని మోసేందుకు ఉపయోగించిన ఈ బ్యాగులు... ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. అందుకే ఆడవారిని అనుక్షణం అంటిపెట్టుకుని ఉంటున్నాయి. అయితే వీటిని క్యారీ చేస్తే చాలదు... పది కాలాల పాటు కాపాడుకోవాలంటే కేర్ తీసుకోవడం కూడా తెలియాలి. లేదంటే ఎంత ఖరీదైన బ్యాగ్ అయినా కళ్లు మూసి తెరిచేలోగా కళావిహీనమైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే...
 
♦ అందరూ కామన్‌గా చేసే తప్పు... అవసరమైనవన్నీ బ్యాగులో కూరేయడం. అది ఇంత లావు అయిపోతుంది. దాంతో అందం పోతుంది. మీరు ఏం పెట్టినా, ఎన్ని పెట్టినా బ్యాగ్ షేప్ మారనివ్వనంత వరకే.
♦ పౌడర్, క్రీమ్, మాయిశ్చరైజర్, నూనె, జెల్, లిప్‌స్టిక్ అంటూ ప్రతి దానినీ బ్యాగులో వేసేస్తారు. అలా నేరుగా వేయకూడదు. ఒక పౌచ్‌లో వేసుకుని, ఆ పౌచ్‌ని బ్యాగ్‌లో వేసుకోవాలి. లేదంటే మరకలు పడిపోతాయి.
♦ సూదిగా ఉండే వస్తువులు బ్యాగ్‌లో వేయకూడదు.  కావాలంటే బాక్స్‌లో కానీ పౌచ్‌లో కానీ పెట్టి వేసుకోవాలి.
♦ కూలింగ్ వాటర్ బాటిళ్లు, ఐస్‌క్రీమ్ వంటివి పెట్టకూడదు. ఆ తడి బ్యాగ్ మెటీరియల్‌ను పాడు చేస్తుంది. అలాగే లంచ్ బాక్సులు కూడా. అవి బ్యాగ్ సహజ వాసనను పోగొట్టి దుర్వాసనకు దారితీస్తాయి.
♦ ఏ క్రీమో, నూనో రాసేసుకుని ఆ చేత్తోనే వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతారు. ఆ అలవాటు చాలు బ్యాగ్‌ని పాడు చేయడానికి. శుభ్రంగా చేతులు కడుక్కుని, తుడుచుకున్నాకే బ్యాగ్ పట్టుకోవాలి.
♦ లెదర్ అయినా, మరే మెటీరియల్ అయినా సబ్బు పెట్టి ఉతక్కూడదు. నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, మెత్తని గుడ్డను ముంచి, దానితో బ్యాగ్‌ను మృదువుగా తుడవాలి.
♦ మరకపడితే వీలైనంత త్వరగా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలి. బాగా ఆరిపోయిన తర్వాత కొన్ని రకాల మెటీరియల్స్ మీది నుంచి మరకను తొలగించడం కష్టం.
♦ బ్యాగ్ దుర్వాసన వస్తోంటే డియోడరెంట్లు, సెంట్లు కొట్టకండి. ఓ చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను వేసి బ్యాగ్‌లో ఉంచుకోండి. కొన్ని గంటలు గడిచేసరికి ఆ వాసనను సోడా పీల్చుకుంటుంది. దుర్వాసన పోతుంది.
♦ వాడనప్పుడు బ్యాగ్‌ని ఏ షెల్ఫులోనో పడేసి ఉంచుతారు. అలా చేయకూడదు. డస్ట్ బ్యాగ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టి దాచాలి. అప్పుడే దుమ్ము చేరకుండా ఉంటుంది. కావాలంటే దిండు కవర్లో పెట్టి కూడా దాచుకోవచ్చు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా