ఓ కానిస్టేబుల్‌.. ఓ ఎమ్మెల్యే

13 Apr, 2020 05:17 IST|Sakshi

కరోనాను ఓడించడానికి, సామాన్యుల్లో ఆత్మసై్థర్యాన్ని నింపడానికి కొందరు స్వచ్ఛందంగా పూనుకుంటున్నారు. వారిలో ఓ మహిళా ఎమ్మెల్యే, మహిళా కానిస్టేబుల్‌ చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ  వ్యక్తుల నుండి ప్రతి ఒక్కరూ ఆయా స్థాయులలో సహకరిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసుల దృష్ట్యా దీనిని నివారించడానికి అదే సమయంలో బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో...

డ్యూటీ తర్వాత మాస్క్‌ల తయారీ
మధ్యప్రదేశ్‌ లోని కురై గ్రామ పోలీస్‌ స్టేషన్లో పనిచేసే సృష్టి అనే మహిళా కానిస్టేబుల్‌ చేసే పని చాలా స్ఫూర్తిదాయకంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. రోజంతా డ్యూటీ చేసి అలసి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ఆ మహిళా కానిస్టేబుల్‌ పోలీసులకు, సామాన్య ప్రజలకు మాస్కుల తయారీలో నిమగ్నం అవుతున్నారు. ఇది మాత్రమే కాదు, తన చేతులతో మాస్క్‌లు తయారు చేసిన ఆమె ఎవరైనా మాక్‌ లేకుండా కనిపిస్తారో వారందరికీ మాస్క్‌ను ఉచితంగా ఇస్తున్నారు. పోలీసు అధికారి ఇన్‌చార్జి రోహిత్‌ మిశ్రా మాట్లాడుతూ ‘శానిటైజర్, మాస్క్‌ల కొరత వల్ల ఈ లాక్‌డౌన్‌ సమయంలో మహిళా కానిస్టేబుల్‌ స్వయంగా తయారుచేయడం చాలా ప్రశంసనీయదగినది’ అంటూ సృష్టి చేస్తున్న పనిని కొనియాడారు.

ప్రజల క్షేమమే ముఖ్యం
రాజస్థాన్‌లోని షేర్‌గడ్‌ ఎమ్మెల్యే మీనా కన్వర్‌ మాస్క్‌లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆమె స్వయంగా తన ఇంట్లో 2 వేల మందికి ముసుగులు తయారు చేస్తున్నారు. ప్రజల క్షేమమే నాకు ముఖ్యం అంటూ మాస్క్‌ల తయారీలో నిమగ్నం అయిన మీనా కన్వర్‌ను స్థానిక మహిళల్లోనూ కరోనా కట్టడికి స్ఫూర్తిని నింపుతున్నారు. మీనా తయారు చేసే ఈ ముసుగులలో సగం ఖైదీలకు పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు. 

మరిన్ని వార్తలు