నొప్పి లేని దంత వైద్యం లేజర్ ద్వారా సాధ్యం

21 Nov, 2013 22:49 IST|Sakshi

 దంత అనారోగ్యమే కాదు... వాటి చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం మనలోని చాలామందిలో ఉంటుంది. దంతాలకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలకూ, లేజర్ చక్కటి పరిష్కారం. నొప్పిలేకుండా చాలా త్వరగా ఉపశమనం కలిగించే ఆధునాతన చికిత్స లేజర్.
 
 లేజర్: లేజర్ అనే కాంతి తక్కువ సమయంలో శరీరంలోని ఏ భాగానికైనా ఎటువంచి నొప్పిని కలిగించకుండా, ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించి, చాలా తొందరగా  ఉపశమనం కలిగిస్తుంది.
 
 దంత చికిత్సలో లేజర్ వల్ల ఉపయోగాలు: నొప్పి కలగకుండా చికిత్స
 
 ఎటువంటి మత్తు అవసరం ఉండదు
 
 చికిత్స సమయంలో ఎటువంటి రక్తస్రావమూ ఉండదు. వైద్యులకు, రోగికి కూడా అనుకూలం
 
 ఇన్‌ఫెక్షన్ వ్యాపించదు
 
 తక్కువ సమయంలో నొప్పిని, వ్యాధిని ఉపసంహరిస్తుంది
 
 చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధి గ్రస్తులకు చాలా అనుకూలం
 లేజర్ చికిత్స తర్వాత, ఉపయోగించే మందులు కూడా తక్కువ.
 
 దంత చికిత్సలో లేజర్ :  

 చిగుళ్ళ చికిత్స : చిగుళ్ళ వాపులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి వ్యాధుల్లో (జింజెవైటిస్, పెరియోడాంటైటిస్) లేజర్‌తో చికిత్స చేయడం చాలా సులువు. డయాబెటిక్ వ్యాధి గ్రస్తులలో ఇది చాలా ఉపయోగం
 
 రూట్ కెనాల్ చికిత్స: లేజర్ కాంతిని కెనాల్‌లో ప్రవేశపెట్టడం ద్వారా, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయి, sterils ఎన్విరాన్‌మెంట్ ఏర్పడి మరలా రీఇన్‌ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది.
 
 పిప్పిపళ్ళ చికిత్స: పంటిని డ్రిల్ చేసేటప్పుడు, పేషెంట్ అనవసరమైన ఆందోళనకు గురికాకుండా, సెన్సిటివిటీ లేకుండా ఉండేందుకు లేజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 నోటిలోని అల్సర్‌లను, గడ్డలను తగ్గించుటకు
 నోటి కేన్సర్‌ను గుర్తించడానికి
 దంతాలు తెల్లగా కనిపించడానికి ఇతర సర్జికల్ పద్ధతులలో కూడా లేజర్ ఉపయోగం ఉంటుంది.
 
 ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. మీ దంత సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది. దంతాల మెరుగైన చికిత్స కోసం, లేజర్ ప్రక్రియ ఒక మెరుగైన పరిష్కారం.
 

మరిన్ని వార్తలు