ఈవెంట్

12 Dec, 2016 14:54 IST|Sakshi

 బెజవాడ గోపాలరెడ్డి సంస్మరణ ప్రసంగం
 తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో, డిసెంబర్ 8న సాయంత్రం 6 గంటలకు పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ‘డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సంస్మరణ ప్రసంగం’ జరగనుంది. అధ్యక్షత: సి.నారాయణరెడ్డి. వక్త: ద్వానా శాస్త్రి.
 
 కవిసంగమం సీరీస్-31

 డిసెంబర్ 10న సాయంత్రం 6 గంటలకు గోల్డెన్ త్రెషోల్డ్, ఆబిడ్స్, హైదరాబాద్‌లో జరిగే ఈ నెల ‘కవిసంగమం’ కార్యక్రమంలో మూడు తరాల కవులు సిద్ధార్థ, మునాసు వెంకట్, అరవింద రాయుడు దేవినేని, పోర్షియా దేవి, అశోక అవారి తమ కవితల్ని వినిపించనున్నారు.
 
 సుంకిరెడ్డి సాహిత్య సమాలోచన
 సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే ఈ సమాలోచనలో సుంకిరెడ్డి ‘తావు’, ‘దాలి’ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. అలాగే, ‘తెలంగాణలో తొలి సాహిత్య చరిత్ర- ముంగిలి’, ‘విమర్శ పరిశోధన కలనేత- గనుమ’, ‘తెలంగాణ అస్తిత్వ కేతనం- తెలంగాణ చరిత్ర’, ‘తెలుగు సాహిత్యంలో సునారె విశిష్టత’, ‘ఉద్యమాలను మలుపు తిప్పే ప్రశ్న- తోవ ఎక్కడ’, ‘జముకు పత్రిక నిర్వహణ’, ‘సుంకిరెడ్డి రచనలు స్త్రీ దృక్కోణం’ వంటి అంశాలపై ప్రసంగాలుంటాయి. పలువురు ప్రొఫెసర్లు, కవులు, రచయితలు పాల్గొనే ఈ సదస్సు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు: సంగిశెట్టి శ్రీనివాస్.
 
 సాహితీ స్రవంతి కార్యశాల
 సాహితీ స్రవంతి కార్యశాల డిసెంబర్ 11న విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద గల ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఉదయం 10:30కు మొదలై పూర్తిరోజు జరిగే ఈ కార్యక్రమంలో సాహిత్య ప్రస్థానం ప్రత్యేక సంచిక ‘స్వేచ్ఛా స్వరం’ ఆవిష్కరణతోపాటు, ‘తెలుగు కథ- ప్రపంచీకరణ’, ‘తెలుగు కథ- సామాజిక వివక్ష’, ‘ప్రపంచీకరణ- కవిత్వం’ అంశాలపై సదస్సులు ఉంటాయి.
 అలాగే, కొందరు యువకవులు తమ కవిత్వానుభవాన్ని వినిపిస్తారు. మరిన్ని వివరాలకు ప్రధాన కార్యదర్శి వొరప్రసాద్ ఫోన్: 9490099059

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా