స్పాట్‌లైట్

12 Oct, 2013 01:31 IST|Sakshi

ఎల్‌జీ జీ2


 ప్రోస్: కొత్త డిజైన్, ఐ ఫోన్ 5, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 4, హెచ్‌టీసీల స్థాయి
 
 కాన్స్: పవర్, పెర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ బెటర్ మాత్రమే. బెస్ట్ కాలేదు.
 
 బోటమ్ లైన్: గుడ్ ఫోన్, కొన్ని బలాలున్నాయి, బలహీనతలు కూడా.
 
 కిండ్లే ఫైర్ హెచ్‌డీఎక్స్ టాబ్లెట్


 ప్రోస్: ఆండ్రాయిడ్ ఎస్, లైట్ వెయిట్, షార్ప్ డిస్‌ప్లే
 
 కాన్స్: ఇతర టాబ్లెట్లతో పోల్చినప్పుడు కొంత వెనుకబడి ఉంది.
 
 బోటమ్ లైన్: ఐప్యాడ్ మినీ, నెక్సస్7 లతో పోలిక ఉంది. పోరాడుతుంది.
 
 గూగుల్‌సెర్చ్ గజినీలను చేస్తోంది!


 సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను మతిమరపు రాయుళ్లుగా చేస్తోంది... అంటున్నారు అధ్యయనకర్తలు. ఇంటర్నెట్‌ను బాగా వినియోగించే రెండువేల మంది యువతీ యువకులపై చేసిన పరిశోధన ఫలితంగా ఈ విషయం తేలిందట. వీరు ఏ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికైనా గూగుల్ ఆశ్రయించడం వల్ల క్రమంగా గజినీలు అవుతున్నారని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. గూగుల్ అందుబాటులో ఉండటంతో ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనే భావనకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్విన్ టవర్స్‌పై తీవ్రవాద దాడులు ఎప్పుడు జరిగాయి, బెర్లిన్ వాల్ ఎప్పుడు కూలింది.. వంటి చారిత్రక ఘటనలను కూడా చాలామంది యువతీ యువకులు మరచిపోయారని, అవసరమైనప్పుడు  గూగుల్‌ను సంప్రదిస్తున్నారని, ఫలితంగా వారిని మతిమరపు ఆవహిస్తోందని అధ్యయనకర్తలు విశ్లేషించారు.
 
 డెల్ నుంచి కొత్త టాబ్లెట్‌లు


 వెన్యూ 7 వెన్యూ 8 : వెన్యూ - 7 (ఏడు అంగుళాలు) వెన్యూ - 8 (ఎనిమిది అంగుళాలు) టాబ్లెట్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. హై డెఫినిషన్ క్వాలిటీతో ఎల్‌సీడీ స్క్రీన్‌తో ఉంటుంది.
 
 వెన్యూ - 7 ధర రూ.9500. వెన్యూ - 8 ధర రూ.11,500.
 వెన్యూ - 8 ప్రో, వెన్యూ - 11 ప్రో: విండోస్ - 8.1 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తాయి. డే-లాంగ్ బ్యాటరీ లైఫ్ ఈ టాబ్లెట్ల ప్రత్యేకత. వీటి ధరలు వరసగా రూ.19,000, రూ.32,000
 

మరిన్ని వార్తలు