పసిడి నవ్వులు!

7 Sep, 2014 23:38 IST|Sakshi
  • ఫొటో స్టోరీ
  • ఈ ఫొటో 1946లో తీసినది. ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. తీసిన ఫొటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ... దీని వెనుక ఉన్న కథ మాత్రం ఎందరినో ఆలోచింపజేసింది. ఈ చిన్నారి ఆస్ట్రియాలోని ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు. తనవారు ఎవరో తెలియక, తనతో ఉన్నవారు తనకు ఏమవుతారో అర్థంకాక దిగులుగా ఉండేవాడు. అలాంటప్పుడే రెడ్‌క్రాస్ సభ్యులు ఆ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు.

    పిల్లలందరికీ రకరకాల బహుమతులు ఇచ్చారు. ఈ బుడతడికి ఒక జత బూట్లు ఇచ్చారు. వాటిని చూసి వాడి కళ్లు మెరిశాయి. ముఖం మతాబులా వెలిగిపోయింది. అంతవరకూ ఉన్న దిగులు మాయమైపోయింది. ఆ కొత్త బూట్ల జతను గుండెలకు హత్తుకుని తన ఆనందాన్ని ఇలా ప్రకటించాడు. మనం చేసే చిన్న సాయం అవతలివారికి కలిగించే సంతోషం ఎంతలా ఉంటుందో తెలియజేసిందీ చిత్రం!
     

మరిన్ని వార్తలు