బద్ధకంతో అనర్థం..

30 Jun, 2015 00:02 IST|Sakshi
బద్ధకంతో అనర్థం..

కొత్త పరిశోధన
చిన్న వయసులోనే బద్దకానికి అలవాటు పడితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. ఇల్లు కదలడానికైనా బద్ధకించే టీనేజర్లు గణనీయంగా కండర శక్తిని కోల్పోయి, వయసు మళ్లిన వారిలా మారుతారని హెచ్చరిస్తున్నారు. టీనేజర్లు కేవలం రెండు వారాలు ఇల్లు కదలకుండా గడిపితే, వారి కండర శక్తి యాభయ్యేళ్లకు పైబడ్డ నడివయస్కుల స్థాయికి దిగజారుతుందని కోపెన్‌హాగన్ వర్సిటీ నిపుణులు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.

యుక్త వయసుల్లో ఉన్నవారు బద్ధకంగా గడిపేస్తే, దాదాపు మూడోవంతు కండర శక్తిని కోల్పోతారని, వయసు మళ్లిన వారు బద్ధకంగా రోజులు వెళ్లదీస్తే, నాలుగోవంతు కండర శక్తిని కోల్పోతారని ఈ అధ్యయనంలో తేలింది. కండరాలు, ఎముకలు బలంగా పటిష్టంగా ఉండాలంటే బద్దకాన్ని వదులుకోక తప్పదని, కాస్తంత వ్యాయామం ఉంటే తప్ప శరీరం అదుపులో ఉండదని కోపెన్‌హాగన్ నిపుణులు వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు