లెనవూ బడ్జెట్ ట్యాబ్లెట్...

21 Jan, 2015 00:09 IST|Sakshi
లెనవూ బడ్జెట్ ట్యాబ్లెట్...

చైనీస్ కంప్యూటర్ తయారీ దిగ్గజం లెనవూ తాజాగా సరికొత్త ట్యాబ్లెట్ ఒకదాన్ని విడుదల చేసింది. శక్తిమంతమైన ఫీచర్లున్నప్పటికీ ధర అందుబాటులోనే ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మైక్రోప్రాసెసర్ విషయాన్నే తీసుకుంటే దీంట్లో 1.3 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికితోడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4, అత్యాధునిక డాల్బీ ఆడియోలు ఉండటం విశేషం.

ఫైళ్లను సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు, ట్యాబ్లెట్ వేగాన్ని పెంచేందుకు, కాంటాక్ట్‌ల సింకింగ్ కోసం లెనవూ డూయిట్ ఆప్స్‌ను అందుబాటులో ఉంచారు. స్క్రీన్ సైజు ఏడు అంగుళాలు కాగా, రెజల్యూషన్ 1024 బై 600గా ఉంది. ఫైవ్ పాయింట్ టచ్ స్క్రీన్, ఒక గిగాబైట్ ర్యామ్, 8జీబీ ప్రధాన మెమరీ దీంట్లోని అదనపు ఫీచర్లు. బ్యాటరీ 3450 ఏంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే... రూ.4999లకే లభించే ఈ ట్యాబ్లెట్‌లో సెల్ఫీ కెమెరా ఒక్కటే ఉండటం అది కూడా 0.3 ఎంపీ రెజల్యూషన్ మాత్రమే కలిగి ఉండటం కొంత నిరాశ కలిగించే అంశం.
 

మరిన్ని వార్తలు