నిద్రమత్తు వదిలించే...తాడాసనం

28 Oct, 2014 00:01 IST|Sakshi
నిద్రమత్తు వదిలించే...తాడాసనం

వ్యాయామం
 
ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా ఉండి నిద్రమత్తు వదలకపోతే రెండు నిమిషాల పాటు ఈ ఆసనాన్ని సాధన చేస్తే చాలు. దేహం చైతన్యవంతమై రోజంతా ఉత్సాహంగా పనిచేస్తుంది.
 
ఎలా చేయాలి?

రెండుపాదాలను దగ్గరగా ఉంచి, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాచి నిటారుగా నిలబడాలి.
     
రెండు చేతులను అలాగే పైకి తీసుకుని వ్రేళ్లలో వ్రేళ్లు చొప్పించాలి(ఇంటర్‌లాక్). ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులనూ ఆకాశం చూస్తున్నట్లుగా పైకి లాగాలి. అదే సమయంలో కాలి మునివేళ్లపైన శరీర బరువు ఉంచి దేహాన్ని లాగినట్లుగా పైకి లేపాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉండి, ఆ తర్వాత నిదానంగా రెండు అరచేతులను తల పైన బోర్లించి రెండు పాదాలను నేల పైన ఉంచాలి.
     
 ఇలా మూడుసార్లు చేస్తే చాలు. రోజును ఉత్సాహంగా గడిపేయవచ్చు.
     
 ఇతర ప్రయోజనాలు: ఎముకలు, కండరాలు చైతన్యవంతం అవుతాయి.  కాలివేళ్లు, మడమలు, మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు, చేతివేళ్లు శక్తిమంతం అవుతాయి. ఈ ఆసనం ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది.
     
 జాగ్రత్త: మోకాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. భుజాల కీళ్లు అరిగిపోయిన వాళ్లు కూడా చేయకూడదు.
 

మరిన్ని వార్తలు