పేనును నలిపేస్తే చాలు!

18 Dec, 2018 05:40 IST|Sakshi

ఇంటి పంట

వంగ మొక్కలకు పేను సమస్య ఉంటుంది. పేను సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. అంటే, లేతాకులను మినహా మిగతా అన్ని ముదురు ఆకులను తెంపి దూరంలో పారెయ్యాలి. మిగిలిన ఆకులకు ఉన్న పేనును చేతి వేళ్లతో సున్నితంగా నలపాలి. వరుసగా రెండు, మూడు రోజులు అలాగే చెయ్యాలి. పేను లేకుండా అవుతుంది. దీనికి ఏ మందులూ స్ప్రే చెయ్యనవసరం లేదు. మిద్దె తోటల్లో చీడపీడల నివారణలో చేతులను మించిన సాధనాలు లేవు.
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు

మరిన్ని వార్తలు