నాలుగు రోజులు

24 May, 2020 05:17 IST|Sakshi

న్యూజిలాండ్‌ సరిహద్దులు మూసివున్నాయి. ఇప్పట్లో లోపలివాళ్లు బయటికి, బయటివాళ్లు లోపలికి ప్రయాణించే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ దేశంలో పర్యాటక రంగ ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు ఒక దారి కనిపెట్టారు. ఉద్యోగులందరికీ వారానికి 4 రోజుల పని మాత్రమే ఉంటే మిగతా మూడు రోజుల్లో దేశం లోపల టూర్‌లకు వెళ్లేందుకు వీలు కల్పించినట్లవుతుంది అనుకున్నారు. ఆమె ఆలోచన ఎక్కువమందికి నచ్చింది. ఉద్యోగుల అభిప్రాయ సేకరణలో 76 శాతం మంది ‘గుడ్‌ ఐడియా’ అన్నారు. నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలోని ఈ దేశానికి భూభాగ సరిహద్దులు లేవు.

వైట్‌ హౌస్‌ బట్లర్‌

విల్సన్‌ జర్మన్‌.. వైట్‌హౌస్‌లో ఆతిథ్యాల ప్రధాన సహాయకుడు (బట్లర్‌). 91 ఏళ్ల వయసులో గురువారం కోవిడ్‌ 19తో చనిపోయారు. మొత్తం 11 మంది అమెరికా అధ్యక్షుల దగ్గర పని చేశారు ఆయన. డ్వైట్‌ ఐసన్‌ హోవర్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధంలో క్లీనర్‌గా చేరారు. బరాక్‌ ఒబామా ఉన్నప్పుడు లిఫ్ట్‌ ఆపరేటర్‌గా రిటైర్‌ అయ్యారు. ‘ప్రథమ కుటుంబాలకు విల్సన్‌ దశాబ్దాల పాటు వైట్‌ హౌస్‌లో సేవలు అందించారు’ అని మిషెల్‌ ఒబామా గుర్తు చేసుకున్నారు. జాన్‌ ఎఫ్‌.కెనడీ హయాంలో విల్సన్‌ బట్లర్‌ అయ్యారు. ‘వైట్‌ హౌస్‌ని వైట్‌ హోమ్‌లా మార్చిన బట్లర్‌గా పేరు తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు