ఉపవాసంతో ఆయుష్షు పెరుగుతుంది

22 Sep, 2018 00:28 IST|Sakshi

అప్పుడప్పుడూ ఉపవాసాలు ఉండటం శరీరానికి మంచిదని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఏ రకమైన మేళ్లు జరుగుతాయన్న అంశంపై మాత్రం పెద్దగా స్పష్టత లేదు. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని అణువులు మన నాడీ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గిస్తూంటుందని జార్జియా స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది. ఉపవాసం ఉన్నా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా  శరీరం చక్కెరలపై ఆధారపడకుండా శరీరంలో ఉండే కొవ్వులను కరిగించడం మొదలుపెడుతుంది.
 

ఈ క్రమంలో శరీరంలో కీటోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో హైడ్రాక్సీబ్యూటరైట్‌ ఒకటి. ఈ కీటోన్లు కణ జీవితకాలాన్ని పెంచుతాయని డాక్టర్‌ మింగ్‌ హుయి ఝౌ చేసిన పరిశోధన చెబుతోంది. హైడ్రాక్సీబ్యూటరేట్‌ కీటోన్లు విభజన ప్రక్రియ ఆగిపోయిన నాడీ వ్యవస్థ కణాలూ మళ్లీ విభజితమయ్యేలా చేస్తాయని ఫలితంగా వృద్ధాప్య లక్షణాలు తక్కువ అవుతాయని వివరించారు. ఆహారం తీసుకున్నా ఇదే రకమైన ప్రభావం చూపగల పదార్థాన్ని కనుక్కోగలిగితే గుండెజబ్బులతోపాటు అల్జైమర్స్‌ వంటి జబ్బులను నివారించేందుకు, సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు