అశ్వాలకు అరటిపళ్లే ఇష్టం

27 Aug, 2015 23:34 IST|Sakshi
అశ్వాలకు అరటిపళ్లే ఇష్టం

పరిపరి  శోధన
 

మానవమాత్రుల ఇష్టాయిష్టాల గురించి శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. అయితే, మూగజీవాల అభి‘రుచు’లపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. ఆ లోటును తీరుద్దామనుకున్నారో ఏమో! ఇంగ్లాండ్‌కు చెందిన డెబోరా గుడ్విన్ అనే శాస్త్రవేత్త అశ్వరాజాల అభి‘రుచు’లపై శ్రద్ధగా పరిశోధన సాగించాడు. ఈ పరిశోధనలో అతగాడు చాలా కొత్త సంగతులనే కనిపెట్టాడు. అశ్వాలకు క్యారట్ల కంటే అరటిపళ్లే ఎక్కువ ఇష్టమని లోకానికి వెల్లడించాడు. అంతేకాదు, అశ్వరాజాలు ఇష్టపడే ఆహార పరిమళాలు వరుసగా మెంతులు, అరటిపళ్లు, చెర్రీలు, దనియాలు, క్యారట్లు, పిప్పరమింట్ వాసనలేనని నిగ్గు తేల్చాడు.

ఇంతకీ ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏముందని అనుకుంటున్నారా? గుడ్విన్ దొరవారు ఫలశ్రుతిని కూడా సెలవిచ్చారు. గుర్రాల కోసం ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసే కంపెనీలు తన పరిశోధనను దృష్టిలో ఉంచుకుని, అశ్వరాజాలు ఇష్టపడే పరిమళాలతో ఉత్పత్తులను రూపొందిస్తే లాభపడగలవని ఢంకా బజాయించి చెబుతున్నాడు.
 

మరిన్ని వార్తలు