ఊబకాయానికి.. బ్యాక్టీరియాకు లింకు!

3 Aug, 2018 00:37 IST|Sakshi

‘‘తినడం తగ్గించేశాను.. రోజూ వ్యాయామం చేస్తున్నాను. కాని ఒళ్లు తగ్గడం లేదు’’ ఈ రకమైన వ్యాఖ్యలు మనం తరచు వింటూంటాం. శరీర™ è త్వం అంతేనేమో అనుకుని సరిపెట్టుకుంటాం కూడా. అయితే అసలు కీలకం మన పేగుల్లోని బ్యాక్టీరియాలో ఉందంటున్నారు మేయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు. శరీరానికి శక్తినిచ్చే కేలరీలన్నీ ఒకేరకంగా ఉండవని, పేగుల్లోని బ్యాక్టీరియా మనం ఆహారాన్ని ఖర్చుపెట్టే క్రమాన్ని మార్చేడం ద్వారా ఒళ్లు పెరగడం/తగ్గడాలను ప్రభావితం చేస్తున్నట్లు వీరు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు.

బరువు తగ్గించుకోవాలనుకుంటున్న ఊబకాయుల పేగుల్లోని బ్యాక్టీరియాలో చాలా మార్పులు ఉన్నాయని వీరు గుర్తించారు. సులువుగా ఒళ్లు తగ్గే వారిలో ఫాస్కోలార్కోటో బ్యాక్టీరియం ఎక్కువగా ఉంటే, ఇతరుల్లో డయాలిస్టర్‌ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త వందనా నెహ్రా తెలిపారు. అలాగే కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయగల ఎంజైమ్‌ల విషయంలోను ఇరువురిలో తేడాలు ఉన్నట్లు తెలిసిందని ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వైద్యులు ఊబకాయులకు మరింత ప్రభావవంతమైన సలహా, సూచనలు ఇవ్వవచ్చునని వందన వివరించారు. 
 

మరిన్ని వార్తలు