పెదవుల సంరక్షణ

15 Dec, 2015 23:31 IST|Sakshi
పెదవుల సంరక్షణ

 బ్యూటిప్స్

చలికాలం పెదవులు పొడి బారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుం టాయి. వాటి నివారణకు కొన్ని చిట్కాలు.  అలోవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలోవెరా జెల్‌ని రాస్తే మృదువుగా అవుతాయి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి.
 
గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.
 
క్యాబేజీని ఉడికించిన నీరు పెదవులకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. కమిలిన పెదవుల చర్మం మృదువుగా అవుతుంది.  కొత్తిమీర రసం పెదవులకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. వారంలో మూడు సార్లు ఈ విధంగా చేస్తే పెదవులపై నల్లని మచ్చలు తగ్గిపోతాయి.
 

 
 

>
మరిన్ని వార్తలు