అంతరాత్మ మాట వినండి

30 Oct, 2015 23:33 IST|Sakshi
అంతరాత్మ మాట వినండి

31 అక్టోబర్ 2015 నుంచి నవంబర్ 6 వరకు
టారో బాణి
 
ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
విలాసంగా జీవించేందుకు కావలసిన ధన సమృద్ధికి పుష్కలంగా అవకాశాలు దొరుకుతాయి. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూడవచ్చు. ఆర్థికంగా లోటుండదు. అయితే మీకు అయిన వారి నుంచే తిరస్కరణలు, నిరాశ, వంచన ఎదురు కావచ్చు. అయితే జీవితంలో ఇదొక దశ మాత్రమే. శాశ్వతం కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ముదురు నీలం
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
అన్నింటా సమతుల్యతను పాటించడం మంచిది. అవిశ్రాంతంగా గడుపుతారు. పనికీ, సమయానికీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు. మీ ప్రేమ సఫలమవుతుంది. మీరేదైనా బంధంలో ఉంటే మాత్రం దానిని దృఢపరచుకో. మీ తప్పులేమిటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. చురుగ్గా, హుషారుగా ఉండండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు
 
 
జెమిని (మే 21-జూన్ 21)

మీ జీవన గమనంలో కీలక మార్పు సంభవించవచ్చు. ఓ విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇతరుల విషయంలో అనవసర జోక్యం వద్దు. అతిగా పని చేయకుండా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. మీరు పురుషులయితే ప్రేమ విషయంలో మీరే చొరవ చూపడం మంచిది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు (పీచ్)
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)

మీరు చాలా మొండివారిగా, బలవంతులుగా మిమ్మల్ని ఎవరూ మార్చలేరన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సమతుల్యత పాటించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏదో అద్భుతం జరిగినట్లుగా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. కొత్త వ్యాపారం ఆరంభమవుతుంది. విజయసోపానాలను అధిరోహిస్తారు. కలిసొచ్చేరంగు: లేత నారింజ రంగు
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
నిజమేదో, ఊహ ఏదో తెలుసుకోవలసిన వారమిది. అలాగే ప్రేమ విషయంలో మీరు అత్యవసర నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అప్పుడప్పుడు స్వల్ప అభద్రతాభావం, కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నా, వారమంతా సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మీ పద్ధతి ప్రకారం మీరు నడచుకుంటూ ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఇంటిని ఆధునీకరించుకోవ డానికి తగిన సమయమిది. మీరు తలపెట్టిన కార్యం సజావుగా పూర్తవుతుంది. గత నెలలో కలిగిన చిక్కులు, చికాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితమనే ఓడ ఎటు తీసుకెళితే అటు నడవండి. మీకు మీరు అనవసర నిర్ణయాలు తీసుకోవద్దు, అపోహలకు, భ్రమలకు గురి కావద్దు. కలిసొచ్చే రంగు: ఊదా
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 ఈ వారం ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. వ్యాపారం లాభాలబాటలో నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పొదుపు చేయడానికి ఇది తగిన సమయం. అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆహార  జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యం విషయంలో అవస్థలు తప్పవు. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ ఆశలు, ఆశయాలకు, మీకున్న వనరులు, సమస్యలు సవాళ్లకు మధ్య వైరుధ్యం ఏర్పడవచ్చు. పని... ఆరోగ్యం... కెరీర్- వీటన్నింటిపరంగా సంతోషం కలుగుతుంది. అంతా సవ్యంగా ఉన్నాయన్న భావన మీ మనసును ఆనందంతో నింపుతుంది. మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బంధాన్ని సరి చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 2
1)
మీ కలల సౌధాన్ని కూలగొట్టుకోవద్దు. వాటిని నెరవేర్చుకునే మార్గ్గాన్ని అన్వేషించండి. రోజువారీ పనులతో జీవితం బోర్‌గా అనిపించకుండా విహార యాత్రలు చేయండి. మీ బంధాలను పునరుద్ధరించుకోండి. బంధుమిత్రుల నుంచి అనూహ్యమైన బహుమతులు రావచ్చు. సామాజిక జీవనం మరింత ప్రకాశ వంతంగా మారుతుంది. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
రానున్న నెలంతా మీకు ఆనందమే ఆనందం. అందుకు ఈ వారమే పునాది. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. మీ వ్యాపార భాగస్వామి విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. ఎదురు చూడని వ్యక్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. ప్రేమికులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
రానున్న నెల మీకు ఒడిదొడుకులతో కూడుకున్న నెల అని చెప్పవచ్చు. మీరు చేస్తున్న పనికి, పెట్టిన పెట్టుబడికి, వచ్చే రాబడికి మధ్య పొత్తు కుదరని విధంగా ఫలితం ఉంటుంది. అయితే రాత్రి తరవాత పగలు, చీకటి తర్వాత వెలుగు ఉంటుందని గ్రహించి, రిలాక్స్ అవండి. రొమాన్స్‌లో ఉంటే ఈ వారం దానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
మీ కోరికలు నెరవేరతాయి. ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు. అనేక సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో అవలీలగాా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుప్పచ్చ రంగు
 
ఇన్సియా కె.
 టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
సౌరవాణి   ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
నిరుద్యోగులు గట్టి ప్రయత్నం మీద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్థులు మీదైన ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధికోసం ఏమైనా పరీక్షలుంటే వాటికి సిద్ధమైతే తప్పక సత్పలితాలు ఉండగలవు. వ్యాపారస్థులయితే కొత్త మెళకువలని తోటి వ్యాపారుల నుండి తెలుసుకోవడం మంచిది. ఏమైనా ఒక నెలలోగా ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగా ప్రయాణించాల్సి ఉంది.
 
టారస్(ఏప్రిల్ 21-మే 20)
ఎవరినో చూసి లేదా ఎవరి ప్రోత్సాహం వల్లనో కొత్తవస్తువాహనాల్ని కొనుగోలు చేయడం ప్రస్తుతం సరికాదు. త్వరలో రానున్న ఓ అవసరం కోసం ఇప్పటినుంచే వ్యయం విషయంలో తగినంత ప్రణాళిక, శ్రద్ధ అవసరం. ప్రభుత్వపరమైన చెల్లింపులువెంటనే చేయండి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం సాగిస్తుంటే దాన్ని వెంటనే విరమించుకోండి.
 
జెమిని (మే 21-జూన్ 21)
ప్రస్తుత ఉద్యోగం నుంచి బయటపడి మరో మంచి ఉద్యోగాన్ని చేయదలచిన మీ ప్రణాళిక అమలు కావడం కష్టమే. అదే విధంగా మీరుంటున్న ఇల్లు లేదా లేదా ఊరి మార్పు కూడా అంత సులభ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటూ రావలసిన సొమ్ముల కోసం ఎదురు చూడడంతో ఈ వారం ముగిసిపోవచ్చు. అయితే ప్రయత్నాన్ని మానకండి.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
దీర్ఘకాలంపాటు శ్రమిస్తేనే గాని పరిష్కరింపబడని సమస్యలు అలాగే కొనసాగవచ్చు.  వాటివల్ల ఆర్థిక లోటు తప్ప మరే నష్టమూ ఉండదు. మీకు తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణం. ఆదాయానికి లోటుండదు కాని అన్ని పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నామనే దిగులు ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఈ వారంలో పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
మీరు ఆరంభించిన ప్రయత్నాలకి అనుగుణంగా మీ ప్రణాళిక ఫలించి చక్కని ఆదాయ  మార్గం ఏర్పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే ఒకప్పటి అపనింద తొలగే అవకాశం ఉంది. కొత్తవ్యాపారాన్ని లేదా గతంలో చేసి మానేసిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. అయితే మీకు మీరుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే సమయం ఉండదని గమనించి దిగండి.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఆర్థికంగా అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో పెద్దగా రాణింపు ఉండకపోవచ్చు. గతాన్ని గురించిన ఆలోచనని మాని, భవిష్యత్ ప్రణాళికని వేసుకోండి. కార్యాల్లో వ్యతిరేకత  ఉండదు అలాగని అనుకూలతా ఉండదు. మిత్రుల మాటల్ని నమ్మి వ్యాపారంలోకి దిగకండి. సలహాలనీ సూచనలనీ వినండి కాని, ఆచరణలోకి తేవాలనుకోవడం సరికాదు ఈ వారానికి.
 
లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. తగినంత విద్యార్హత ఉన్నా ఉద్యోగం లేదా వ్యాపారాన్ని చేసే వీలు సాధ్యం కాకపోవచ్చు. మీ అనవసర పట్టుదల మాని, రాజీ యత్నం చేస్తే ఫలితం అనుకూలంగానే ఉంటుంది. మీ కుటుంబం మీకు ముఖ్యం తప్ప మీ సహాయం వల్ల మరో కుటుంబం ఉన్నతిని పొందుతుందని మీ కుటుంబాన్ని వెనక్కి పెట్టుకోవడం సరి కాదు.
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)

ప్రస్తుతం మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే మానసిక స్థితి ఊగులాట ధోరణిలో ఉంటూ దాంపత్య అన్యోన్యత విషయంలో తీవ్ర వ్యగ్రతతో ఉండవచ్చు. మానసిక అనారోగ్యం వల్ల శరీరారోగ్యమూ దెబ్బతిన వచ్చు కాబట్టి వ్యాయామాల్ని చేస్తూ తగిన ఆరోగ్య పద్ధతుల్ని అవలంబిస్తూ ఆధ్యాత్మికతవైపు దృష్టి మళ్లించడం మంచిది.
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)
మొహమాటం వల్ల లేదా నోటిమాటగా చెప్తే ఏమౌతుందో అనే ఆలోచన వల్ల మీ అభిప్రాయాన్ని మీ పనుల ద్వారా తెలియజేయడం సరికాదు. మీరు అజాత శత్రువు కాబట్టి మీ అసౌకర్యం గురించి వివరించి చెప్పడం ఉత్తమం. మీరే ఉద్యోగాన్ని లేదా ఆరోగ్యాన్ని వంకగా పెట్టుకుని ఇష్టం లేని పనుల్ని వాయిదా వేస్తున్నారేమో గమనించుకోండి. దోషిగా దొరికి పోకండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఆశలు ఆకాశంలో, ఆచరణ పాతాళంలో ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? బంధువుల పట్ల ప్రేమాభిమానాలుండవచ్చునేమో కాని అతి కాకూడదని గమనించండి. మాట కరుకుదనం వల్ల, పట్టువిడుపులు లేని కారణంగా వ్యాపారంలో మీకు పేరు రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా కొంతమొత్తం సొమ్ముని ఓ పక్కన దాచి ఉంచండి.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ ఏదో ఆందోళనతో గడుపుతారు ఈ వారాన్ని. దానిక్కారణం అనవసరమైన వాగ్వివాదాన్ని పెట్టుకుని ఏం జరుగుతుందోననే ఒక లో భయంతో ఉండడమే. పట్టుదలకి పోకండి. వాగ్వివాదాలూ హామీలూ మంచిది కాదు. మీరూ మీ కుటుంబం అనే ధ్యాసతో గడపండి కాలాన్ని. వినోదయాత్రగాని విహార యాత్రగాని చేసే అవకాశం ఉంది.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

సంతానానికి సంబంధించిన చదువులు చక్కగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆర్థిక సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే జంకుగా అనిపించవచ్చు. అదీ ఒకందుకు మంచిదే. నిలకడగానే వ్యాపారాన్ని చేయండి. బంధుమిత్రులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. సంతృప్తితో గడపండి. ఆందోళనకి దూరంగా ఉండండి.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

మరిన్ని వార్తలు