రారండోయ్‌

9 Sep, 2019 00:15 IST|Sakshi
  • సి.వి. కృష్ణారావు (1926–2019) ‘స్మృతి మననం’  కార్యక్రమం సెప్టెంబర్‌ 11న సా. 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది.  నిర్వహణ: ‘తెలంగాణ చైతన్య సాహితి’, ‘నెలనెలా వెన్నెల సాహితీ మిత్రులు’, ‘తెలంగాణ రచయితల సంఘం’.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా సెప్టెంబర్‌ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాలులో కవిరాజమూర్తి నవల ‘మై గరీబ్‌ హూ’పై తాటికొండాల నరసింహారావు ప్రసంగిస్తారు.
  • అన్నపరెడ్డి బుద్ధఘోషుడు రచించిన ‘ఓ అనాత్మవాది ఆత్మకథ’ పుస్తక విమోచన సభ సెప్టెంబర్‌ 15న సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో జరగనుంది. ఆవిష్కర్త: కె.కె.రాజా. అనంతరం అన్నపరెడ్డికి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం జరగనుంది.
  • ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా అందిస్తున్న సçహృదయ సాహిత్య పురస్కారానికి 2018కిగానూ మందరపు హైమవతి ‘నీలిగోరింట’ ఎంపికైందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఎన్‌.వి.ఎన్‌. చారి తెలియజేస్తున్నారు. సెప్టెంబరు 15న రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం, హనుమకొండలో  పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 
  • ఈ యేడు ప్రారంభిస్తున్న ఉదారి వాణిదాసు స్మారక పురస్కారాన్ని కవి అన్నవరం దేవేందర్‌కు సెప్టెంబర్‌ 15న ఆదిలాబాద్‌లో ప్రదానం చేస్తున్నట్టు ఉదారి నారాయణ తెలియజేస్తున్నారు.
  • డాక్టర్‌ సి.భవానీదేవి ‘స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ’, చారిత్రక నవల ‘బంగారు కల’ ఆవిష్కరణ సభ సెప్టెంబర్‌ 15న ఉదయం 10:30కు గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో జరగనుంది. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం.
  • డాక్టర్‌ శాంతి నారాయణ రచనలు– ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు’ 2వ భాగం ఆవిష్కరణ సభ సెప్టెంబర్‌ 15న ఉదయం 10 గంటలకు అనంతపురం, రుద్రంపేటలోని వాల్మీకి భవనంలో జరగనుంది.  నిర్వహణ: విమలాశాంతి సేవాసమితి.
  • సి.సి. నెమరు పుస్తకావిష్కరణ సెప్టెంబర్‌ 15న ఉ.11 గంటలకు వనపర్తి జిల్లా అచ్యుతాపురంలో జరుగుతుంది. సభాధ్యక్షత: సి.రాంమోహన్‌: నిర్వహణ: సిఎన్‌ఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌.
  • 2019 రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కోసం 2017, 18, 19 సంవత్సరాల్లో ప్రచురించబడిన తెలుగు కవితా సంపుటాల 5 ప్రతులను అక్టోబర్‌ 21లోగా పంపాలని కన్వీనర్‌ మద్దికుంట లక్ష్మణ్‌ కోరుతున్నారు. విజేతకు 15 వేల నగదు పురస్కారం ఉంటుంది. చిరునామా: అధ్యక్షులు, రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505301.
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా