రారండోయ్‌

16 Dec, 2019 00:07 IST|Sakshi

► ధనికొండ హనుమంతరావు శతజయంతి వేడుకలు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 16న రోజంతా జరగనున్నాయి. ధనికొండ పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది. ఆవిష్కర్త: కె.శ్రీనివాస్‌.
 నరేష్‌కుమార్‌ సూఫీ కవిత్వ సంపుటి ‘నిశ్శబ్ద’ పరిచయ సభ డిసెంబర్‌ 17న సా. 6 గం.కు రవీంద్రభారతి మినీ హాల్‌లో జరగనుంది. అధ్యక్షత: విజయ్‌ కుమార్‌ కోడూరి.
 అఫ్సర్‌ 40 ఏళ్ల సమగ్ర కవిత్వం ‘అప్పటినుంచి ఇప్పటిదాకా’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 20న సా. 5 గంటలకు సాలార్‌జంగ్‌ మ్యూజియం లెక్చర్‌ హాల్‌లో జరగనుంది. ప్రచురణ: చిత్రలేఖ పబ్లికేషన్స్‌. 
► నామిని సుబ్రమణ్యం నాయుడు సంపాదకత్వం వహిం చిన ‘ఒక ఆలోచన, ఒక అవలోకన’ పుస్తకాన్ని  భూమన కరుణాకరరెడ్డి డిసెంబర్‌ 20న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో ఆవిష్కరిస్తారు.  ప్రచురణ: వరదరాజ నగర్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ. నిర్వహణ: మానవ వికాస వేదిక.
 చరిత్ర ఆధారిత కాల్పనిక సాహిత్యంపై సాయి పాపినేని రచనల నేపథ్యంలో చర్చ డిసెంబర్‌ 21న మధ్యాహ్నం 3 గంటలకు హుస్సేన్‌ సాగర్లో,  తెలంగాణ టూరిజం వారి బోటులో జరగనుంది. సుధాకర్‌ ఉణుదుర్తి, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, జ్యోతి పి. వక్తలు. సమన్వయం: నరేశ్‌ నున్నా. రిజిస్ట్రేషన్‌ కొరకు: 9845034442
 రివాజు: తెలంగాణ కథ–2018 ఆవిష్కరణ డిసెంబర్‌ 22న ఉదయం 10:30కు హన్మకొండలోని రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో జరగనుంది. సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌. ఆవిష్కర్త: బన్న అయిలయ్య. నిర్వహణ: సృజన లోకం, సింగిడి.
 శివే గారి ‘కరిగిపోవే కన్నీటి చుక్క’ ఆవిష్కరణ డిసెంబర్‌ 22న హైదరాబాద్, చింతల్‌ సిద్దార్థ పాఠశాలలో ప్రముఖుల చేతులమీదుగా జరగనుంది.
 సింగమనేని నారాయణ పేరుతో ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారానికి జనవరి 2018 నుండి డిసెంబరు 2019 వరకు ప్రచురించిన కథల సంపుటులను ఆహ్వానిస్తున్నారు. పురస్కార నగదు పదహారు వేలు. సంపుటాల మూడు ప్రతుల్ని జనవరి 15 లోగా పంపాల్సిన చిరునామా: అధ్యక్షులు, ఏరువాక సాహిత్య సాంస్కృతిక సంస్థ, 7–1–507, ఎన్జీవో కాలనీ, బద్వేల్‌–516227. వైఎస్‌ఆర్‌ కడప. ఫోన్‌: 7013736729
 నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో జరగనున్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ‘ప్రపంచ తెలుగు రచయితల సంఘం 2019’ ఈ సభలను నిర్వహిస్తోంది.  గౌరవాధ్యక్షులు: మండలి బుద్ధప్రసాద్‌. తెలుగుకు సంబం ధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయి. వివరాలకు: pట్చp్చnఛిజ్చ్టి్ఛ uజu.ఛిౌఝ వెబ్‌సైట్‌ చూడొచ్చు. కార్యదర్శి డాక్టర్‌ జి.వి.పూర్ణచందు ఫోన్‌: 9440172642
 డా.పసునూరి రవీందర్‌ సాహిత్య విమర్శ సంపుటాలు ఇమ్మతి, గ్లోబలైజేషన్‌ ఆవిష్కరణ సభ ఈ నెల 21న రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు జరుగును. ఆవిష్కర్త: డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నిర్వహణ: సింగిడి.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజమైన హీరోలు కావాలి

తొలి గెలుపు

అద్దె మాఫీ

నాట్యప్రియ

బహుమతులు

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌