రారండోయ్‌

16 Sep, 2019 01:04 IST|Sakshi

‘విసిసిట్యూడ్స్‌ ఆఫ్‌ ద గాడెస్‌’, ‘బుద్ధిజం ఇన్‌ ద కృష్ణా రివర్‌ వేలీ’  గ్రంథాల రచయిత్రి ప్రొఫెసర్‌పద్మ హోల్ట్‌ విజయవాడ రాక సందర్భంగా, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 16న సాయంత్రం 5 గంటలకు మధుమాలక్ష్మి చాంబర్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో– సాయి పాపినేని ‘ఆంధ్రనగరి’ నేపథ్యంలో తెలుగులో చారిత్రక కాల్పనిక సాహిత్యపు ఆవశ్యకతపై పద్మ  ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: సజ్జల రామకృష్ణారెడ్డి. 

మధురాంతకం నరేంద్ర కథల సంపుటి ‘నాలుగుకాళ్ల మండపం’ ఆవిష్కరణ సెప్టెంబర్‌ 21న ఉదయం 10 గంటలకు తిరుపతి, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: కొలకలూరి ఇనాక్‌. జి.ఎం.సుందరవల్లి, పి.శ్రీధర రెడ్డి, వాసిరెడ్డి నవీన్, మహమ్మద్‌ ఖదీర్‌బాబు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బి.తిరుపతి రావు పాల్గొంటారు. నిర్వహణ: ఆంగ్ల, తెలుగు  శాఖలు, ఎస్వీ యూనివర్సిటీ; ఆన్వీక్షికి పబ్లిషర్స్‌.

సెప్టెంబర్‌ 22న ఉదయం 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో జరిగే రాజాం రచయితల వేదిక సమావేశంలో ‘గ్రామ నామ విజ్ఞానం’ (టొపోనమి) అంశంపై వాండ్రంగి కొండలరావు ప్రసంగిస్తారు.

డాక్టర్‌ మల్లెమాల వేణుగోపాలరెడ్డి కుటుంబీకులు 2009 నుండి ఇస్తోన్న మల్లెమాల పురస్కారాన్ని ఈ ఏడాది రచయిత షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్నికి సెప్టెంబర్‌ 22న ఉదయం సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో ప్రదానం చేయనున్నారు. 

నాటక, నవల, కథా రచయిత, నృత్యరూపకాల స్రష్ట పోలవరపు కోటేశ్వరరావు సమగ్ర సాహిత్యాన్ని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ప్రచురించనుంది. అలభ్య రచనలను పంపాల్సిందిగా ఫౌండేషన్‌ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కోరుతున్నారు. చిరునామా: 9–28–4, బాలాజీ నగర్, విశాఖపట్టణం – 530003. ఫోన్‌: 9849067343. 
మెయిల్‌: ylp@1953@gmail.com

జాషువా జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ‘జాషువా సాహిత్యం మానవతా దృక్పథం’ అంశం మీద వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నారు. మొదటి, రెండవ బహుమతులు రూ. 5 వేలు, 3 వేలు. సెప్టెంబర్‌ 22లోపు పంపాల్సిన మెయిల్‌. drfaustus999@gmail.com వివరాలకు: పచ్చల రాజేశ్, ఫోన్‌: 8331823086

మరిన్ని వార్తలు