రారండోయ్‌

17 Jun, 2019 00:54 IST|Sakshi
  • డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ కవిత్వం ‘ఉద్యమం ఉద్యమమే’ గ్రంథావిష్కరణ జూన్‌ 18న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: కె.శివారెడ్డి. నిర్వహణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం.
  • డాక్టర్‌ సి.భవానీదేవి ‘స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ’ ఆవిష్కరణ సభ జూన్‌ 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. గ్రంథ స్వీకర్త: ఎస్వీ రామారావు. నిర్వహణ: కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌.
  • కల్లూరి శ్యామల పుస్తకాల– ‘కంచికి వెళ్లకూడని కథలు’, ‘రజనీగంధ’(పాపినేని శివశంకర్‌ కవిత్వ ఆంగ్లానువాదం), భావ విహంగాలు(టాగూర్‌ స్ట్రేబర్డ్స్‌ తెలుగు అనువాదం)– ఆవిష్కరణ సభ జూన్‌ 23న సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రజాశక్తి నగర్‌లోని శిఖర స్కూల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం. నిర్వహణ: సాహితీ మిత్రులు.
  • పుష్యమీసాగర్‌ కవితా సంపుటి ‘పునరావృత దృశ్యం’ ఆవిష్కరణ జూన్‌ 23న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: సుద్దాల అశోక్‌తేజ. నిర్వహణ: కవిసంగమం.
  • డాక్టర్‌ పెద్దాడ వేంకట లక్ష్మీసుబ్బారావు ‘మరణానంతర జీవనం’ ఆవిష్కరణ జూన్‌ 22న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. ఆవిష్కర్త: వోలేటి పార్వతీశం. ఈటెల సమ్మన్న, జనార్దనమూర్తి, బైస దేవదాస్, కూర చిదంబరం పాల్గొంటారు. నిర్వహణ: తెలుగు సాహిత్య కళాపీఠం.
  • రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో– సాహిత్యం–రంగస్థలం అంశంపై డాక్టర్‌ మీగడ రామలింగస్వామి జూన్‌ 23న ఉదయం 9:30కు రాజాంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో ప్రసంగిస్తారు.
  • ‘జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ జీవన సాఫల్య పురస్కారాన్ని అంపశయ్య నవీన్‌కూ,  జూన్‌19న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో ప్రదానం చేయనున్నారు. శకుంతలా జైనీ కళా పురస్కారాలను వీరికి ఇవ్వనున్నారు: వి. రాజారామ మోహనరావు, స్వాతి శ్రీపాద, విజయలక్ష్మి పండిట్, వెంకట్‌ గుడిపాటి, పత్తిపాక మోహన్, నగేశ్‌ బీరెడ్డి, శ్రీరాంసాగర్‌ కవచం, పెద్దింటి అశోక్‌ కుమార్, పసునూరి రవీందర్, మహమ్మద్‌ రఫీ, అన్వర్, జానీ చరణ్‌ బాషా తక్కెడశిల. డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ నవల ‘నిఘా’, కథాసంపుటి ‘మీల్స్‌ టికెట్‌’ ఆవిష్కరణ ఈ సభలోనే జరగనుంది. ముఖ్య అతిథి: మాడభూషి శ్రీధర్‌. 
మరిన్ని వార్తలు