రారండోయ్‌ 

15 Oct, 2018 00:30 IST|Sakshi
  • నారాయణస్వామి వెంకటయోగి ‘నడిసొచ్చిన తొవ్వ’ (కవిత్వంతో కరచాలనం) ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 16న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. తొలిప్రతి స్వీకర్త: కె.శివారెడ్డి. నిర్వహణ: కవిసంగమం. అధ్యక్షత: సుధాకిరణ్‌.
  • మట్టిముద్రణలు, ఆలగడప ప్రచురించిన జయతి లోహితాక్షన్‌ రచన ‘అడవి నుండి అడవికి’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 21న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: విజయప్రతాప్‌. నిర్వహణ: వాడ్రేవు చినవీరభద్రుడు. వక్తలు: దాసరి అమరేంద్ర, కుప్పిలి పద్మ, ఆదిత్య కొర్రపాటి.
  • జానమద్ది సాహితీ పీఠం వారి జానమద్ది పురస్కారాలను గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి, విద్వాన్‌ కట్టా నరసింహులకు అక్టోబర్‌ 21న ఉదయం 10:15కు కడప నగరంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో జరగనుంది. ముఖ్య అతిథి: జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి.
  • మహాకవి శేషేంద్ర 91వ జయంతి సాహిత్య సదస్సు అక్టోబర్‌ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ, హైదరాబాద్‌లో జరగనుంది. నిర్వహణ: సినారె–వంశీ విజ్ఞాన పీఠం. ముఖ్య అతిథి: డి.చంద్రశేఖర రెడ్డి.
  • ‘భారతరత్న’ అబ్దుల్‌ కలాం జయంతి రోజైన అక్టోబర్‌ 15న ఉదయం 11 గంటల నుంచి   పిల్లల పుస్తక ప్రదర్శన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల దినోత్సవం వరకు కొనసాగనుంది. నిర్వహణ: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌.
  • అబ్దుల్‌ కలామ్‌ స్మారక ఉపన్యాసం, జాతీయ అవార్డుల ప్రదానం అక్టోబర్‌ 15న ఉదయం 10 గంటలకు కెవిటి కన్వెన్షన్‌ సెంటర్, ఆదిశంకర గ్రూప్‌ కళాశాల ప్రాంగణం, గూడూరులో జరగనుంది. నిర్వహణ: సింహపురి ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమి. 
  • పొత్తూరి సుబ్బారావు కవితా సంపుటి ‘స్తబ్దత నుండి సమరం వైపు’ ఆవిష్కరణ అక్టోబర్‌ 15న త్యాగరాయ గానసభలో జరగనుంది. ఆవిష్కర్త: కె.వి.రమణాచారి. నిర్వహణ: జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌.
     
మరిన్ని వార్తలు