రారండోయ్‌

18 Nov, 2019 00:42 IST|Sakshi
  • జయరాజు ‘అవని’ పుస్తకం ఆవిష్కరణ నవంబర్‌ 19న సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది.
  • మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రణవి పుస్తకాల– అరణ్యవాసం, చిత్రమైన అమ్మమ్మ– ఆవిష్కరణ నవంబర్‌ 19న మధ్యాహ్నం 2 గంటలకు కళాశాల రజతోత్సవ ప్రాంగణంలో జరగనుంది. అధ్యక్షత: మాడభూషి సంపత్‌కుమార్‌.
  • డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ కథల సంపుటి ‘పుంజీతం’ ఆవిష్కరణ నవంబర్‌ 21న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. నందిని సిధారెడ్డి, పత్తిపాక మోహన్, మామిడి హరికృష్ణ, పెద్దింటి అశోక్‌కుమార్, జె.రాజారాం, వెల్దండి సురేఖ పాల్గొంటారు. నిర్వహణ: దక్కన్‌ సాహిత్య సభ.
  • కొల్లూరి సోమశంకర్‌ అనువాద కథల సంపుటి ‘ఏడు గంటల వార్తలు’ ఆవిష్కరణ నవంబర్‌ 23న సాయంత్రం 5:30కు హైదరాబాద్, కూకట్‌పల్లి, బాలాజీనగర్, హెచ్‌ఐజీ 85లోని ఆలంబనలో జరగనుంది. ఆవిష్కర్త: దాసరి శిరీష. వక్తలు: చంద్రశేఖర అజాద్, వేమూరి సత్యనారాయణ, దాసరి అమరేంద్ర.
  • రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో నవంబర్‌ 24న ఉ. 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో గంటేడ కథ– ఉత్తరాంధ్ర వ్యథ అంశంపై ఆల్తి మోహనరావు ప్రసంగిస్తారు.
  • కాళ్ల సత్యనారాయణ తొలి వర్ధంతి సభ నవంబర్‌ 24న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ఎన్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో ‘కాళ్ల చిత్రకళా ఉత్సవ్‌’ పేరిట జరగనుంది. ‘కాళ్ల గుర్తులు’ స్మారక సంచిక ఆవిష్కరణతో పాటు, ఐదు నుండి డిగ్రీ విద్యార్థులకు వయసుల వారీగా మూడు విభాగాలుగా చిత్రకళా పోటీ ఉంటుంది. వివరాలకు: 8105257242
  • కథ 2018 ఆవిష్కరణ సభ నవంబర్‌ 24న ఉదయం 10:30కు పశ్చిమ గోదావరి, నర్సాపురంలోని వై.ఎన్‌.కళాశాల పి.జి.సెమినార్‌ హాల్‌లో జరగనుంది. సంపాదకులు: వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌. ఆవిష్కర్త: వెల్చేరు నారాయణరావు. వంశీ, కె.శివారెడ్డి, వి.ప్రతిమ పాల్గొంటారు. నిర్వహణ: యర్రమిల్లి నారాయణమూర్తి కాలేజీ తెలుగు శాఖ ‘తెలుగు వెలుగు’ ఆధ్వర్యంలో కథాసాహితి. మధ్యాహ్నం దాసరి అమరేంద్ర నిర్వహణలో సంకలనంలోని కథారచయితలతో ముఖాముఖి ఉంటుంది.
  • మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంతి సాహిత్య సదస్సు నవంబర్‌ 30న సాయంత్రం 4 గంటలకు గురజాడ సమావేశ మందిరం, ఆం.ప్ర., తెలంగాణ మహాసభ ప్రాంగణం, న్యూఢిల్లీలో జరగనుంది. నిర్వహణ: ఆదిలీలా ఫౌండేషన్, మధునాపంతుల శత జయంతి ఉత్సవ సంఘం. 
మరిన్ని వార్తలు