రారండోయ్‌

9 Mar, 2020 00:54 IST|Sakshi
  • గంటి భానుమతి రెండు నవలలు తమసోమా జ్యోతిర్గమయ, పడి లేచిన కెరటం ఆవిష్కరణ సభ మార్చి 11న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య కళానిలయంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌.
  • డాక్టర్‌ కె.అన్ష ‘గడచిన రెండు దశాబ్దాల హిందీ కథ– శ్రామిక వర్గ సమస్యలు’(హిందీ) ఆవిష్కరణ మార్చి 12న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్‌లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా మార్చి 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నవీన్‌ నవల అంపశయ్య గురించి కె.పి.అశోక్‌ కుమార్‌ ప్రసంగిస్తారు.
  • జాతీయ సాహిత్య పరిషత్‌ సిద్దిపేట శాఖ 33వ వార్షికోత్సవం మార్చి 15న మధ్యాహ్నం 3 కు సిద్దిపేట ప్రెస్‌ క్లబ్‌లో జరగనుంది. పలు పురస్కారాల ప్రదానాలు, పుస్తకావిష్కరణలు జరగనున్నాయి.
  • ప్రభాకర్‌ మందార తెలుగులోకి అనువదించిన జె.వి.పవార్‌ ఆంగ్ల రచన ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ ఆవిష్కరణ మార్చి 15న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరగనుంది. బెజవాడ విల్సన్‌తో చర్చ ఉంటుంది. నిర్వహణ: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌. 

  • ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని గరికపాటి నరసింహారావుకు మార్చి 15న సాయంత్రం 6:03 గంటలకు హైదరాబాద్, బర్కత్‌పురాలోని యాదాద్రి కల్యాణ మండపంలో చేయనున్నారు. కె.వి.రమణాచారి, కె.వరప్రసాద్‌రెడ్డి, ఎన్‌.అనంతలక్ష్మి, కడిమెళ్ల వరప్రసాద్‌ పాల్గొంటారు. నిర్వహణ: ఉషశ్రీ మిషన్‌.
  • మునిపల్లె రాజు సాహిత్య పురస్కారాన్ని విహారికి మార్చి 16న సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: మునిపల్లె రాజు కుటుంబ సభ్యులు, శ్రీ త్యాగరాయ గానసభ.
  • సాహిత్య అకాడమీ, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా మార్చి 17న సాయంత్రం 5 గంటలకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ‘విమర్శకునితో ఒక సాయంత్రం’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో కోవెల సుప్రసన్నాచార్య తన విమర్శ ప్రస్థానం గురించి ముచ్చటిస్తారు.
  • బాలచెలిమి పత్రిక ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాల బడి పిల్లల కథలను 13 సంకలనాలుగా ప్రచురించనుంది. ప్రధానోపాధ్యాయుడి ధ్రువపత్రంతో ఒకవైపునే రాసిన రెండు ఏ4 కాగితాలకు మించని కథలను మార్చి 20లోగా పంపాలి. చిరునామా: చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి, 3–6–716, స్ట్రీట్‌ నం. 12, హిమాయత్‌ నగర్, హైదరాబాద్‌–29.  ఫోన్‌: 8686664949 
మరిన్ని వార్తలు