రారండోయ్‌

6 May, 2019 00:51 IST|Sakshi
  • కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్‌ సంపాదకత్వం వహించిన ‘క్రీడాకథ’ ఆవిష్కరణ మే 6న సా.6 గంటలకు రవీంద్రభారతి మినీ హాలులో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: సంచిక వెబ్‌ పత్రిక, సాహితి ప్రచురణలు.
  • గీతాంజలి ప్రసంగమాల కార్యక్రమం మే 7న సా. 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది. వక్తలు: జగద్ధాత్రి, రామతీర్థ. నిర్వహణ: మొజాయిక్‌ సాహిత్య సంస్థ. 
  • అమృతలత– అపురూప అవార్డ్స్‌ 2019 ప్రదానం మే 12న సాయంత్రం 4:45కు తెలుగు యూనివర్సిటీలో జరగనుంది. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను జలంధర, ఎస్‌.పి.శైలజ; అపురూప అవార్డ్స్‌ను శీలా సుభద్రాదేవి, గోళ్లమూడి సంధ్య, స్వాతి శ్రీపాద, శరత్‌ జ్యోత్స్నారాణి, శిలాలోలిత, కిరణ్‌బాల, కన్నెగంటి అనసూయ, వనజా ఉదయ్, అయినంపూడి శ్రీలక్ష్మి, తాయమ్మ కరుణకు ప్రదానం చేస్తారు. 
  • ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ 2019 పురస్కారాన్ని శిఖామణికి మే 18న ఉదయం 10 గంటలకు విశాఖపట్నం పబ్లిక్‌ లైబ్రరీలో ప్రదానం చేస్తారు. వక్త: కొప్పర్తి. 
  • సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్‌ ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా అందించే ‘సహృదయ సాహితీ పురస్కారం 2018’ కోసం తెలుగు వచన కవుల నుండి 2014–2018 మధ్యలో ప్రచురితమైన వచన కవితా సంపుటాలను జూన్‌ 15లోగా పంపవలసిందిగా ప్రధాన కార్యదర్శి ఎన్‌.వి.ఎన్‌.చారి కోరుతున్నారు. చిరునామా: కుందావఝల కృష్ణమూర్తి , ప్లాట్‌ నం. 207, ఇంటి నం.  2–07–580, సెంట్రల్‌ ఎక్సయిజ్‌ కాలనీ, హనుమకొండ–506001. ఫోన్‌: 9849366652

మరిన్ని వార్తలు