రారండోయ్‌

16 Mar, 2020 00:49 IST|Sakshi

► సలీం  నవలలు – పడిలేచే కెరటం, అరణ్య పర్వం ఆవిష్కరణ సభ మార్చి17న సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య కళా నిలయంలోని జరుగుతుంది. ఏనుగు నరసింహారెడ్డి, కే.వీ. రమణ, నందిని సిధారెడ్డి, పి. జ్యోతి, కస్తూరి మురళికృష్ణ, కే.పి. అశోక్‌ కుమార్‌  ప్రసంగిస్తారు.  

► సాహిత్య అకాడెమీ, కవిసంధ్య సంయుక్తంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మార్చి 21న యానాంలో ‘యానాం పొయిట్రీ ఫెస్టివల్‌’ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కవిత్వంలో ఇటీవలి ధోరణులు అంశంపై సదస్సు జరగనుంది. శిఖామణి, శివారెడ్డి, విజయభాస్కర్, ఖాదర్, పాపినేని, దర్భశయనం, జి.లక్ష్మీనరసయ్య పాల్గొంటారు. కవిసంధ్య–ఆంధ్రీకుటీరం కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం, కవి సమ్మేళనం ఉంటాయి.

► కోవెల సుప్రసన్నాచార్య ప్రారంభించిన   స్వాధ్యాయ సాహితీ పురస్కారాన్ని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణకి ఈనెల మార్చి 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నారపల్లిలో జరిగే సభలో ప్రదానం చేస్తారు. గన్నమరాజు గిరిజా మనోహర్, మామిడి హరికృష్ణ, తిగుళ్ల కృష్ణమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి, బుద్ధా మురళి, ఏనుగు నర్సింహారెడ్డి పాల్గొంటారు.

► సహృదయ సాహితీ పురస్కారం – 2019 కోసం 2015–2019 మధ్య వచ్చిన పద్యకావ్య, పద్యకవితా సంపుటాల 3 ప్రతులను ఏప్రిల్‌ 30లోగా పంపాలని సహృదయ సంస్థ సాహిత్య కార్యదర్శి కోరుతున్నారు. పురస్కార నగదు: 10 వేలు. ప్రదానం ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా జూలై 12న. చిరునామా: కె.కృష్ణమూర్తి, ప్లాట్‌ నం. 207, 2–7–580, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ–506001.

మరిన్ని వార్తలు