రైతు కోసం....

1 Oct, 2014 00:14 IST|Sakshi
రైతు కోసం....

గౌహతి-ఐఐటి నుంచి పట్టా పుచ్చుకున్న రఘు కంచుస్తంభం తాను రూపొందించిన యాప్ ద్వారా ప్రపంచదృష్టిని ఆకరిస్తున్నారు. ఈ హైదరాబాదీ రూపొందించిన ‘లైవ్లీహుడ్ 360’ యాప్ ‘ది బెస్ట్ యాప్ ఇన్ ఏషియా కేటగిరి’లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.
 
‘లైవ్లీహుడ్’ను అరకులోయ ప్రాంతంలోని 650 గ్రామాలకు చెందిన 12,000 మంది రైతులు ఉపయోగిస్తున్నారు. రైతుల పంటకు సంబంధించిన దిగుబడి, చెల్లించాల్సిన ధర...మొదలైన వివరాలను ఈ యాప్ ద్వారా త్వరితగతిన తెలుసుకోవచ్చు. ప్రతి రైతుకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. మీట నొక్కితే చాలు...బ్యాంకుల నుంచి తీసుకున్న  రుణంతో సహా ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే కాక ఒక ప్రాంతానికి సంబంధించిన పారిశుధ్యం, అక్షరాస్యత వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
 
‘‘పంట ఉత్పత్తుల అమ్మాకానికి సంబంధించిన డబ్బు...ఈ యాప్ ద్వారా త్వరగా చేతికందుతుంది’’ అంటున్నారు రఘు. రఘు రూపొందించిన యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది. అన్నిటి కంటే ముఖ్యంగా రైతు కళ్లలో కాంతి నింపింది.

మరిన్ని వార్తలు