ఒంటరి మినిస్టర్‌!

18 Jan, 2018 23:43 IST|Sakshi

గుడ్‌ సైన్‌ 

దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కార్మికులు, మహిళలు.. ఇలా ఒక్కో శాఖకు ఒక్కో మంత్రి ఉండడం ఏ దేశ క్యాబినెట్‌లోనైనా సహజమే. అయితే ఇప్పుడు బ్రిటన్‌కు ఓ కొత్త మినిస్టర్‌ వచ్చారు. వారే ‘లోన్లీనెస్‌ మినిస్టర్‌’! బ్రిటన్‌లో ఒంటరిగా జీవితం గడుపుతున్న వారిని అక్కున చేర్చుకుని వారికి నాలుగు తియ్యని మాటలు చెప్పే.. వాళ్లు చెప్పే కబుర్లను ఆసక్తిగా వినే.. ఆత్మీయ ఆశ్రమాలను ఆ శాఖ నెలకొల్పుతుంది.

ఉద్యోగ విరమణ పొంది లేదా విడాకులు తీసుకుని లేదా అయినవాళ్లను పోగొట్టుకుని జీవితాన్ని ఒంటరిగా, నిస్పృహగా గడుపుతున్న వృద్ధుల కోసమే ప్రత్యేకంగా బ్రిటన్‌ ప్రభుత్వం ఈ శాఖను సృష్టించింది. తొలి ‘లోన్లీనెస్‌’ శాఖ మంత్రిగా ట్రేసీ క్రౌచ్‌ అనే మహిళా ఎంపీని బ్రిటన్‌ ప్రధాని ‘థెరిస్సా మే’ నియమించారు. 

మరిన్ని వార్తలు