లేపాక్షి బసవన్న

3 Mar, 2019 02:04 IST|Sakshi

కథాశిల్పం

స్కాందపురాణం ప్రకారం మనదేశంలోని 108 శైవక్షేత్రాలలో అనంతపురం జిల్లా లేపాక్షిలో కొలువై ఉన్న శివుడికి పాపనాశేశ్వరుడని పేరు. ఈ క్షేత్రం శిల్పక కు పెట్టింది పేరు. ఆలయ స్తంభాలమీద విజయనగర రాజుల కాలంనాటిఅద్భుత శిల్ప కళానైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. లేపాక్షిలో యాత్రికులను కట్టిపడేసే మరొక అద్భుతం లేపాక్షి బసవన్న. దాదాపు 16 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో మెడలో చిరుమువ్వలు, కాళ్లకు గజ్జెల పట్టెడలతో, మూపున అలంకరించిన దుస్తులతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన నందీశ్వరుడి సజీవ శిల్పం చూస్తుంటే లేచివస్తాడేమో అనిపిస్తుంది.

మెడచుట్టూ మూడురకాల పట్టెడలు, అన్నింటికంటె కింఇభాగాన 29 గంటలున్న పట్టెడ, దానిపైన 18 మువ్వలున్న పట్టెడ, ఆ పైన 27 రుద్రాక్షలున్న మాలతో అలంకరించి ఉన్న ఈ శిల్పం కాళ్లు, తోక పొట్టకిందుగా లోపలికి మడిచిపెట్టుకుని ప్రశాంత గంభీరంగా కనిపిస్తుంది. లేపాక్షి చుట్టుపక్కల ఎవరి పశువుకైనా జబ్బు చేస్తే వారు ఈ నంది విగ్రహం వద్దకు వచ్చి నూనెతో దీపాన్ని వెలిగించి మొక్కుకుని వెళతారు. వాళ్లు మొక్కుకున్న మరుసటిరోజే ఆ జబ్బు నయమవుతుందట. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లేపాక్షి నంది రంకె వేస్తే ప్రళయం వస్తుందని స్థలపురాణం చెబుతోంది.
– శ్రీలేఖ

మరిన్ని వార్తలు