అతడి ప్రేమ నిజమేనా?

16 Feb, 2018 00:40 IST|Sakshi

లవ్‌ డిటెక్టర్‌ 

ప్రేమిస్తున్నామంటూ మీ వెంటపడే వారికి మీ మీద ఉన్నది నిజమైన ప్రేమ అవునో, కాదో ల్యాబొరేటరీ సాక్షిగా తేల్చేసేందుకు కొత్త తరహా వైద్య పరీక్ష ఒకటి 2028 నాటికల్లా అందుబాటులోకి రానుందట! ఇలాంటి పరీక్ష అందుబాటులోకి వచ్చేస్తే ప్రపంచంలో నకిలీ ప్రేమలు, ప్రేమ పేరిట మోసాలు మటుమాయం కాగలవని ప్రేమైక జీవులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంగా ప్రేమలో పడిన వారి మెదడులో ‘నానో పెపై్టడ్స్‌’ అనే రసాయనాలు ఉత్పత్తవుతాయని, వీటి జాడను కనుగొనేందుకు ఎలాంటి రక్తపరీక్షలు అక్కర్లేదని, చాలా తేలికగా నిర్వహించే ఎంఆర్‌ఐ తరహా స్కానింగ్‌ పరీక్షతో ఇవి ఉత్పత్తవుతున్నదీ, లేనిదీ ఇట్టే తేల్చేయవచ్చని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ ఫ్రెడ్‌ నోర్‌ అనే న్యూరో సైంటిస్ట్‌ చెబుతున్నారు.

వాలెంటైన్స్‌ డే రోజున తాను రచించిన ‘ట్రూ లవ్‌: లవ్‌ ఎక్స్‌ప్లెయిన్డ్‌ బై సైన్స్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక వ్యక్తి మెదడులో ‘నానో పెపై్టడ్స్‌’ అధిక మోతాదులో లేకుంటే, ఆ వ్యక్తి వ్యక్తం చేస్తున్న ప్రేమ సిసలైనది కాదని, సిసలైన ప్రేమను గుర్తించడానికి అధిక మోతాదులో ఉత్పత్తయ్యే ‘నానో పెపై్టడ్స్‌’ మాత్రమే ఏకైక నిదర్శనమని డాక్టర్‌ నోర్‌ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు