ఏడేళ్లు చిన్నవాడైనా నిజాయితీ చూసి ఓకే చేశాను.

28 Aug, 2019 07:18 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌ న న్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సార్‌! నాకొక అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. నాకంటే ఏడేళ్లు చిన్నవాడైనా తన ప్రేమలో నిజాయితీ చూసి ఓకే చేశాను. కలిసి ఇద్దరం ఫోర్‌ ఇయర్స్‌ ఉన్నాం. మా అమ్మని కూడా ఒప్పించాడు. వాళ్ల ఫాదర్‌ చనిపోవడంతో ఆయన గవర్నమెంట్‌ జాబ్‌ తనకి వచ్చింది. తర్వాత వన్‌ ఇయర్‌ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అవాయిడ్‌ చెయ్యడం మొదలుపెట్టాడు. నిలదీసి అడిగితే ‘ఏం లేదు’ అన్నాడు. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌ స్టార్ట్‌ చేశాడనే నిజం నాకు తెలిసిపోయింది. వాళ్లు కలిసి తిరగడం, కలిసి దిగిన ఫొటోస్‌ అన్నీ చూశాను. ‘ఏంటిదంతా?’ అని వాళ్ల ఆఫీస్‌కి వెళ్లి అడిగాను. దాంతో తను రివర్స్‌ అయిపోయాడు. ‘నీకు అనుమానం.. నువ్వు నాకు వద్దు’ అని తిట్టడమే కాకుండా మా అమ్మకి ఫోన్‌ చేసి.. ‘మీ అమ్మాయికి అనుమానం ఎక్కువ. తను నాకొద్దు’ అని చెప్పి నన్ను శాశ్వతంగా వదిలేశాడు. తను రాడని నాకు తెలుసు. కానీ త్రీ ఇయర్స్‌గా తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. చాలా సంబంధాలు కాదనుకున్నాను. అమ్మ నన్ను ఏం అనలేక బాధపడుతోంది. నాకు కొంచెం ధైర్యం చెప్పండి అన్నయ్యా ప్లీజ్‌. – ధరణి

వాడొక పెంట రాస్కెల్‌!! ప్రేమ బ్యాండ్‌ వేసి వాడుకునే దుర్మార్గుడు!! ఇంత చిన్నవయసులోనే అంత మోసం నేర్చుకున్నాడంటే..వాడిని నమ్మి.. వాడి కోసం వెయిట్‌ చేసి.. వాడే నా లవ్‌ అనుకుని.. నువ్వు నీ లైఫ్‌ని దుర్భరం చేసుకోవడం వెరీ సిల్లీ బంగారం!! లవ్‌ చాలా పవిత్రమైనది! లవ్‌ చాలా పవర్‌ఫుల్‌! లవ్‌ చాలా గ్రేట్‌! ఒకరోజు నీకు వాడు చేసిన అన్యాయానికి..మూల్యం చెల్లించక తప్పదు.. ఒక దరిద్రుడు నీ జీవితంలో నుంచి వెళ్లిపోయాడని కాలర్‌ ఎగరేసుకుని ముందుకు సాగిపో..!! ‘సార్‌ అమ్మాయిలు కాలర్‌ ఉన్న డ్రెస్‌లు తక్కువగా వేసుకుంటారు సార్‌!’ అయితే తలెత్తుకుని లైఫ్‌ని మళ్లీ హ్యాపీగా జీవించమను నీలూ!! ‘అవును ధరణీ..! వాడొక యాక్‌.... థూ!! గాడు.. బీ స్ట్రాంగ్‌!!’
lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు