లవ్‌ డాక్టర్‌

5 Mar, 2018 00:09 IST|Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. తనకి ప్రపోజ్‌ చేస్తే, ఓకే చెప్పింది. మేమిద్దరం ఒకే కంపెనీలో జాబ్‌ చేస్తున్నాం. ఏదో పని పడటంతో పదిహేను రోజులు లీవ్‌ పెట్టి మా ఊరికి వెళ్లాను. వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు కనిపించింది. అసలు నాతో మాట్లాడటమే మానేసింది. ఏమైంది? ఎందుకు? అని అడిగితే...  ‘మన నేపథ్యాలు వేరు’ అంటోంది. మరి నా లవ్‌ను ఒప్పుకున్నప్పుడు తెలియదా అన్నయ్యా మా నేపథ్యాలు వేరని? అంతేకాదు, తను వేరే అబ్బాయిని లవ్‌ చేస్తోందని నా ఫ్రెండ్‌ ఒకడు చెప్పాడు. తన బర్త్‌డే పార్టీకి కూడా నన్ను పిలవలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ప్లీజ్‌ అన్నయ్యా..! నాకు మంచి సలహా ఇవ్వండి.

అంతగా బాధ పడకు బ్రో! ‘ఫిఫ్టిన్‌ డేస్‌లో మైండ్‌ చేంజ్‌ అయితే బాధ కాదా సార్‌..??’ మైండ్‌ కాబట్టి చేంజ్‌ అవుతుంది. ‘ఏంటి సార్‌..! అన్నీ పజిల్స్‌లో మాట్లాడుతున్నారు?’ హార్ట్‌ అయితే చేంజ్‌ అయ్యేది కాదు అని చెబుతున్నా..! ‘మైండ్‌ అయితే చేంజ్‌ అయింది కానీ హార్ట్‌ చేంజ్‌ కాలేదని  చెబుతున్నారా సార్‌?’ కాదు నీలాంబరి.. హార్ట్‌తో ప్రేమించి ఉంటే చేంజ్‌ అయ్యేది కాదని చెబుతున్నా..! ‘అంటే మైండ్‌తో కూడా ప్రేమిస్తారా సార్‌?’ ఇష్టపడటం అంటే మైండ్‌కు నచ్చినట్టు నీలూ! ‘ప్రేమంటే హార్ట్‌కు గుచ్చుకున్నట్టు కదా సార్‌..!!’ అబ్బా... నా దగ్గర ఎంత జ్ఞానం పుచ్చుకున్నావు నీలూ..! ‘సార్‌..! ఈ ఆన్సర్‌ శరత్‌కి నచ్చకున్నాది సార్‌...’
హార్ట్‌తో చదవమను, మైండ్‌తో కాదు... ఆన్సర్‌ నచ్చుతుంది నీలూ..!
– శరత్‌

మరిన్ని వార్తలు