నన్నడగొద్దు ప్లీజ్‌

15 Oct, 2018 01:02 IST|Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. మొదట్లో ఒకసారి ఫోన్‌ చేస్తే.. ‘నీ మీద ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు’ అంది. వాళ్ల ఫ్రెండ్స్‌తో బాగా చాట్‌ చేసేది. నా మెసేజ్‌కి మాత్రం లేట్‌గా రిప్లై ఇచ్చేది. దాంతో నేను లైట్‌ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత తను నన్ను చూసి నవ్వడం, నావైపు చూసేది. దాంతో చాట్‌ చెయ్యడం, మాట్లాడటం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా సేమ్‌. ‘నా మెసేజ్‌కి లేట్‌ రిప్లై ఏంటి?’ అని అడిగితే ‘నా ఇష్టం’ అని చెప్పి బ్లాక్‌ చేస్తోంది. మళ్లీ నేను బతిమిలాడితేనే అన్‌బ్లాక్‌ చేస్తోంది. తన కోసం నా ఫ్రెండ్స్, నా డ్రీమ్స్‌ అన్నీ వదిలేశాను. కానీ తను మాత్రం నన్ను అర్థం చేసుకోదు. ‘నాకు మీ ఫ్యామిలీ నచ్చదు. మీ ఫ్యామిలీకి నన్ను ఇవ్వరు. నా మీద హోప్స్‌ పెట్టుకోకు’ అంటోంది. వాళ్ల ఇల్లు మా ఇంటి ముందే. తనని చూసిన ప్రతిసారీ ఏడుపు వస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. ప్లీజ్‌ అన్నయ్యా! మంచి సలహా ఇవ్వండి. – సన్నీ

చెప్పింది కదా సన్నీ ‘ఫీలింగ్‌ లేదని’..!? ‘మరి ఎందుకు సార్‌ చూడటం, నవ్వడం, కవ్వించడం..?’ నీలూ... నీలూ... నీలూ....! మార్నింగ్‌ లేచి సూర్యుడిని చూడరా?? ‘సూర్యుడి పేరు పెట్టారని సన్నీని చూస్తుందా సార్‌? మరీ వెటకారం ఎక్కువైపోయింది సార్‌ మీకు..! చెప్పేవాడికి అడిగేవాడు లోకువ సార్‌..! పాపం సన్నీని చూసింది, నవ్వింది, కవ్వింది.. ఇప్పుడు వద్దంది..!’ కవ్విందేంటి నీలూ?? ప్రాస కలిసిందని తెలుగును ఖూనీ చేస్తున్నావ్‌!? ‘సార్‌.. మీరు ప్రేమను ఖూనీ చేస్తున్నారు.

సన్నీ సన్లైట్‌ని ఖూనీ చేస్తున్నారు. ఒక మెగా లవర్‌ హార్ట్‌ని ఖూనీ చేస్తున్నారు సార్‌!’ అది కాదు సన్నీ..! అమ్మాయికి మనమంటే ఇష్టం లేనప్పుడు.. ఊరికే వెంట పడి, నువ్వే కావాలని సాంగ్స్‌ సింగి..(పాడి..) మనం చీప్‌ కాకూడదని చెబుతున్నాను... ఆ అమ్మాయి మన ఫ్యామిలీ గురించి కూడా ఒకలాగ మాట్లాడింది.. మనకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉండాలి.. రెస్పెక్ట్‌ లేని చోట లవ్‌ ఉండదు. నేను నీ లవ్‌ని ఖూనీ చెయ్యడం లేదు..!! ‘అవును సార్‌.. మీరు సన్నీ ఆత్మాభిమానం ఖూనీ కాకుండా చూస్తున్నారు సార్‌!’


- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు