లవ్‌ డాక్టర్‌

23 May, 2017 23:59 IST|Sakshi
లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా! లాస్ట్‌ టైమ్‌ నేను అడిగిన ప్రాబ్లమ్‌కి రిప్లై ఇచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్స్‌! అన్నయ్యా.. మీరు అన్నారు... నన్ను లవ్‌ చేసిన అబ్బాయిది లవ్‌ కాదు పొసెసివ్‌ నెస్‌ అని, అసలు లవ్‌కి, పొసెసివ్‌నెస్‌కి తేడా ఏంటి? వదిలేయమన్నారు తనని. కానీ, నేను తనని మరిచిపోలేను. తనకు నేనంటే చాలా ఇష్టం. తనని మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. ఏం చేస్తే తను మారతాడు అన్నయ్యా..? మీరు వదిలేయమని చెప్పినా.. మళ్లీ అడిగినందుకు కోప్పడకండి. ఫ్యూచర్‌లో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇలాంటి అడ్జెస్ట్‌మెంట్‌లు తప్పవు కదా! అలాంటప్పుడు లవ్‌ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే బెటర్‌ కదా! తన పొసెసివ్‌నెస్‌ని నార్మల్‌లవ్‌గా మార్చుకోవడానికి నేనేం చెయ్యాలో చెప్పండి ప్లీజ్‌!    – నైమిశ
‘సార్‌ చెప్పండి సార్‌! ఇవాళ మీ ఇజ్జత్‌ కా సవాల్‌! ఈ ఆన్సర్‌ ఇవ్వకపోతే బోర్డు తిప్పి అరటిపండ్లు అమ్ముకోవడం బెటర్‌! లవ్‌కి, పొసెసివ్‌నెస్‌కి తేడా ఏంటో చెప్పండి! లేకపోతే తేడా కొట్టుద్ది సార్‌! మీ రీడర్స్‌ అంతా వెయిటింగ్‌... కళ్లార్పకుండా చదువుతున్నారు! కమాన్‌ ఐ సే’ అని నవ్వింది నీలాంబరి.

అంతగా రెచ్చిపోకు నీలాంబరీ... ఐ నో ది డిఫరెన్స్‌! లవ్‌ అంటే అరటిపండు. పొసెసివ్‌నెస్‌ అంటే మామిడిపండు. మామిడిపండు ఏడాదిలో టూ మంత్సే దొరుకుతుంది. అరటిపండు ఎవ్రీ మంత్, ఎవ్రీ డే దొరుకుతుంది. అందుకే అరటిపండు ట్రూ లవ్‌. మామిడి పండు అరటిపండు కాలేదు. అరటిపండు ఎప్పటికీ మామిడి పండు కాదు!

మరిన్ని వార్తలు