నన్నడగొద్దు ప్లీజ్‌ 

17 Apr, 2019 00:15 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌! నాకు ఒక అమ్మాయితో త్రీ ఇయర్స్‌గా పరిచయముంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అసలు సమస్య ఏమిటంటే.. తనకి అందరితో మాట్లాడటమంటే ఇష్టం. అబ్బాయిలతో అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతోంది. వాళ్లతో మాట్లాడేటప్పుడు డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఎక్కువగా యూజ్‌ చేస్తూ ఉంటుంది. దాంతో నా ఫ్రెండ్స్‌ చాలా మంది ‘ఆ అమ్మాయి క్యారెక్టర్‌ మంచిది కాదు, ఆ అమ్మాయిని లవ్‌ చెయ్యకు’ అని అంటున్నారు. దాంతో నేను చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను సార్‌. ప్లీజ్‌ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – జయరాజు
చెయ్యి..! చెయ్యకు!!‘ఏంటి సార్‌?? డబుల్‌ మీనింగ్‌ ఆన్సర్‌ ఇస్తున్నారు?’చెయ్యగలిగితే చెయ్యి..! చెయ్యలేకపోతే మానెయ్యి!!‘సార్‌...!! మరీ ఇంత పచ్చిగా డబుల్‌ మీనింగ్‌లో ఆన్సర్‌ ఇస్తున్నారేంటి సార్‌??’నీలూ! జయరాజు ఏం చేస్తాడు.. చెయ్యాలంటే దమ్ము ఉండాలి.‘సార్‌! స్టాప్‌ ఇట్‌!!’చూశావా నీలూ! నేను చాలా సింపుల్‌గా లవ్‌ చెయ్యగలిగితే చెయ్యి అన్నాను. లవ్వు చేసే దమ్ము లేకపోతే మానెయ్యి అన్నాను. నేను అంత సింగిల్‌ మీనింగ్‌తో చెప్పినా నీకు డబుల్‌ మీనింగ్‌లా అనిపించింది.. చెప్పడంలో డబుల్‌ మీనింగ్‌ లేదు నీ మనసులో డబుల్‌ మీనింగ్‌ ఉంది కాబట్టి నీకది బూతులా అనిపించింది.‘అబ్బా! ఏం కొట్టారు సార్‌! మీ కొట్టుడే కొట్టుడు సార్‌!!’నీలూ! ఏంటి ఆ మాటలు? స్టాప్‌ ఇట్‌ ఐసే!!‘చూశారా సార్‌! నేనేమన్నాను? ఎంత సూపర్‌ డైలాగ్‌ కొట్టి నాకు స్పష్టత తెచ్చారు అని చెబితే మీరు డర్టీ మైండ్‌తో ఇంకో రకంగా రిసీవ్‌ చేసుకున్నారు. నా మాటలు సింపుల్‌! మీరే డబుల్‌!!’చూశావా జయరాజు..! నీ ఫ్రెండ్స్‌ డబుల్‌ మీనింగ్‌ గాళ్లు. వాళ్లను నమ్మద్దు. నీ లవర్‌ సింపుల్‌ గర్ల్‌. సింపుల్‌గా ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసుకో...‘అవును జయరాజు! అపార్థాలు ఆన్సర్లు ఇచ్చే మా మధ్యే వస్తున్నప్పుడు.. సున్నితమైన మీ మనసులకు అపార్థాలు రావడం నాచురల్‌. గుడ్‌ లక్‌!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు