నన్నడగొద్దు ప్లీజ్‌

3 Apr, 2017 00:43 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హాయ్‌... సర్‌! నేను ఒక అమ్మాయిని సెవన్‌ ఇయర్స్‌ నుంచి లవ్‌ చేస్తున్నా. ఆమెకు తెలియకుండా మూడేళ్లు, తెలిసి నాలుగేళ్లు అవుతోంది. ఆమె ఫ్రెండ్స్‌తో లవ్‌ లెటర్‌ ఇచ్చాను. డైరెక్ట్‌గా ప్రపోజ్‌ చేశాను. కానీ ఎలాంటి స్పందనా లేదు. తన ఫ్రెండ్‌ అడిగితే ‘నా కలర్‌కు అతని కలర్‌కి సెట్‌ కాదు’ అని అందట. అందంగా లేకపోవడమే నా తప్పా అనుకుని వెంటపడడం మానేసి చదువుపై దృష్టిపెట్టాను. కానీ ఇప్పుడు నేను కనిపిస్తే నవ్వుతోంది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం... అంటే ఛాన్స్‌ ఇవ్వడంలేదు. తను అలా చేస్తుంటే కోపం వస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాను. సెవన్‌ ఇయర్స్‌గా పట్టించుకోని అమ్మాయి ఇప్పుడు చూసి నవ్వుతోంది అంటే ప్రేమ అని ఎలా నమ్మాలి? ప్లీజ్‌ ఏదైనా సలహా ఇవ్వండి సర్‌.– నరేష్‌

‘కొత్త పేస్ట్‌ వాడుతున్నావా నీలాంబరి? అప్పటి నుంచి చూస్తున్నాను పళ్లు చూపిస్తున్నావు. వాట్‌ ఈజ్‌ ద సీక్రెట్‌ ఆఫ్‌ యువర్‌ తళ తళ తెలుపు..? లైట్‌ ఆన్‌ చేయకుండా నీ పంటి స్పాట్‌లైట్‌తో క్లినిక్‌ నడిపించొచ్చు, నో ఎలక్ట్రిసిటీ బిల్‌’ అని నవ్వా. ‘అంతే... మెన్‌ ఆర్‌ లైక్‌ దట్‌ ఓన్లీ. ఇది పేస్ట్‌ ఇంపాక్ట్‌ కాదు సార్‌. ఇది కాన్ఫిడెన్స్‌ ఇంపాక్ట్‌. నాలో ఉన్న కాన్ఫిడెన్స్‌ నా స్మైల్‌లో కనబడుతుంది. మీకు కనబడడం లేదా’... అని ఒక లుక్‌ విసిరింది.

బల్ల మీద మోచేయి పెట్టి, దాని మీద ఫేస్‌ ల్యాండింగ్‌ చేసి, అప్పటి దాకా నీలాంబరి స్మైల్‌ను ముచ్చటగా చూస్తున్న నేను... నీలాంబరి ఆన్సర్‌కి మోచెయ్యి జారి ఆల్‌మోస్ట్‌ నా పళ్లు రాలగొట్టుకున్నా. నీ పళ్లు జాగ్రత్త నరేష్‌ బ్రో. అమ్మాయి స్మైల్‌ అంటే ఇన్విటేషన్‌ కాదు, ఆట పట్టించడం కాదు, శాడిజం అంతకన్నా కాదు, ప్యూర్‌ కాన్ఫిడెన్స్‌ అని అర్థం చేసుకో. లేకపోతే నాలాగే ఆల్‌మోస్ట్‌ పళ్లు గుల్లే.
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు