నన్నడగొద్దు ప్లీజ్‌ 

5 Sep, 2018 00:48 IST|Sakshi

హాయ్‌ సార్‌..! నేను మూడు సంవత్సరాలుగా ఒక అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నాను. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. అనుకోకుండా రీసెంట్‌గా మా ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి ‘నో’ అన్నారు. అయినా సరే తననే పెళ్లి చేసుకుంటానని క్లియర్‌గా చెప్పేశాను. చివరికి ఒప్పుకున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే... నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడటం తనకి అసలు ఇష్టం ఉండటంలేదు. నిత్యం అనుమానిస్తున్నాడు. నా క్యారెక్టర్‌ గురించి దారుణంగా తిడుతున్నాడు. ఎవరితో మాట్లాడినా సరే రాంగ్‌గా ఆలోచిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి? అంత చెత్తగా మాట్లాడేవాడితో జీవితాన్ని పంచుకోవాలని లేదు. కానీ తన జ్ఞాపకాల నుంచి దూరం కాలేకపోతున్నాను. గొడవ అయిన ప్రతిసారీ ‘నిన్ను మా అమ్మ ఒప్పుకోదు, నువ్వే ఒప్పించుకోవాలి’ అంటున్నాడు. మా మధ్య ఏదయినా గొడవ జరిగినప్పుడు కూడా నేను బతిమాలుకుంటేగాని తను తిరిగి నాతో మాట్లాడడు. తనే నా సర్వస్వం అని అందరినీ వదలుకుని మరీ తనతో వస్తే, తనేమో అలా బిహేవ్‌ చేస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది కానీ నా పేరెంట్స్‌ కోసం ఆలోచిస్తున్నాను. ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమించినంత స్ట్రాంగ్‌గా.. ఒక అమ్మాయిని ఎందుకు ఈ అబ్బాయిలు ప్రేమించరు? నమ్మరు?? కొన్ని రోజుల్లో నా బర్త్‌డే ఉంది. ఈ బర్త్‌డేకైనా నా లైఫ్‌ని ఫ్రెష్‌గా రీస్టార్ట్‌ చెయ్యాలని ఉందన్నయ్యా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌..! – శ్రీ
ఐ యామ్‌ సో ప్రౌడ్‌ ఆఫ్‌ యు శ్రీ!ఇంకొకరైతే ఆ సుడిగుండంలో పడి నరకం చూసేవారు..!కానీ నువ్వు తెగువతో ఆలోచిస్తున్నావు..!వాడికి విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంది..!లైఫ్‌లో నిన్ను ఎప్పటికీనమ్మడు..!అనుమానిస్తాడు, అవమానిస్తాడు, క్యారెక్టర్‌ని దెబ్బ తీస్తాడు..!నీ సెల్ఫ్‌ వర్త్‌ని, నీ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ని పాతాళానికి తొక్కేస్తాడు..!నీకు నీమీదే అనుమానం వచ్చేలా వీక్‌గా చేసేస్తాడు..! గుడ్‌ డెïసీషన్‌ ఏంటంటే, వెంటనే ఆ దుర్మార్గుడికి బై చెప్పడం..!సింపుల్‌గా చెబుతా.. నీ ప్రేమ తెగని దారం లాంటిది.ఆ అందమైన దారాన్ని బంధంగా మార్చాల్సింది పోయి...ఆ దారంతోనే నిన్ను బందీని చేయాలనుకుంటున్నాడు..!తెంచేసెయ్యి..! తుంచేసెయ్యి..!! త్యజించేసెయ్యి...!! బీ హ్యాపీ.. హ్యాపీ బర్త్‌ డే! హ్యాపీ న్యూ లైఫ్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపాన్ని బాగు చేయనా?

చర్మంపై ముడతలు పోవాలంటే..

రాముడు–భీముడు.. గంగ–మంగ

బాదం.. ఆరోగ్యవేదం!

గ్యాస్‌ ట్రబుల్‌ మందులతో కిడ్నీకి చేటు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!