నన్నడగొద్దు ప్లీజ్‌ 

20 Sep, 2018 02:07 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని సెవెన్త్‌ క్లాస్‌ నుంచి లవ్‌ చేస్తున్నాను. తను మా మావయ్య వాళ్ల అబ్బాయి. తను కూడా నన్ను లవ్‌ చేస్తున్నాడు. మా లవ్‌ జర్నీ స్టార్ట్‌ అయ్యి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. నేను పీజీ చేస్తున్నాను. తను పీజీ పూర్తి చేసి గవర్నమెంట్‌ జాబ్‌కి ప్రయత్నాలు చేస్తున్నాడు. జాబ్‌ రాగానే మ్యారేజ్‌ చేసుకుందామంటున్నాడు. వాళ్ల ఇంట్లో మా పెళ్లికి సపోర్ట్‌గా ఉన్నారు కానీ మా ఇంట్లో మా పేరెంట్స్‌ ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం మా అన్నయ్య మాత్రమే సపోర్ట్‌గా ఉన్నాడు. ‘నిన్ను బావకు ఇచ్చే పెళ్లి చేస్తాను. బాధపడకు’ అని మా అన్నయ్య మాట ఇచ్చాడు. కానీ మా పేరెంట్స్‌ సపోర్ట్‌ లేకుండా నేను హ్యాపీగా ఉండలేను కదన్నయ్యా. వాళ్లని ఒప్పించాలంటే నేను ఏం చెయ్యాలి అన్నయ్యా? దయచేసి మంచి సలహా ఇవ్వండి.– ప్రవీణ
వద్దే వద్దు ప్రవీణా..!!‘ఏంటి సార్‌ బావామరదళ్లు పెళ్లి చేసుకుంటే... పుట్టబోయే పిల్లలకు ప్రాబ్లమ్‌ అని చెబితే... వాళ్లెలా ఊరుకుంటారు సార్‌? అయినా ప్రేమ ఏమైనా బంధుత్వం అడిగి వస్తుందా సార్‌? అంటే కొంచెం ఇష్టం అనిపించినప్పుడు.. లవ్‌ వచ్చి.. చెవులు కొరుకుతుందా సార్‌? ‘‘సారీ..! వాడు నీ బావ, ఈ లైన్‌లో లవ్వు పుడుతుంది..’’ అని చెబుతుందా సార్‌??? లవ్వుకు లేని రెస్ట్రిక్షన్స్‌ మీకేంటి సార్‌? ఎప్పుడూ బావామరదళ్ల లవ్వులో కాలడ్డమేస్తూ ఉంటారు.

అయినా మన పెద్దవాళ్లు ఎంతమంది చేసుకోలేదు సార్‌ చుట్టరికం పెళ్లిళ్లు? ఎందుకు సార్‌ ఈ శాడిస్ట్‌ ఆన్సర్లు??? ఇంకేదైనా చెప్పండి పాపం! ప్రవీణ అసలే చాలా డౌట్‌లో ఉంది సార్‌!’నీలాంబరీ..! తెలిసి తెలిసి తప్పు చెయ్యొద్దు. వాళ్ల పేరెంట్స్‌ ఏమనుకొని ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదో తెలియదు కానీ.. ప్రవీణకి దేవుడు ఇంకో ఛాన్స్‌ ఇస్తున్నాడు తప్పు చెయ్యొద్దని, పుట్టబోయే పిల్లలకు అన్యాయం చెయ్యొద్దు! అది మహా పాపం అని.. దేవుడు పేరెంట్స్‌ రూపంలో వచ్చి చెబుతున్నాడు అనిపిస్తోంది నీలూ!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

మరిన్ని వార్తలు