నన్నడగొద్దు ప్లీజ్‌ 

24 Oct, 2018 01:26 IST|Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని నాలుగేళ్లుగా లవ్‌ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్‌ చేశాడు. మేమిద్దరం క్లాస్‌మేట్స్‌. చదువు పూర్తికాగానే జాబ్‌ చేద్దామనుకున్నాను. కానీ తను ‘నేను జాబ్‌ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోను, వద్దు’ అన్నాడు. నేను కూడా తన మాటకు గౌరవమిచ్చి జాబ్‌ చెయ్యాలనే ఆలోచనను మానుకున్నాను. తనకి మంచి జాబ్‌ వచ్చింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ తర్వాత నుంచి నన్ను ఇగ్నోర్‌ చెయ్యడం మొదలుపెట్టాడు. రీజన్‌ లేకపోయినా తిట్టేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగితే... ‘నాకు నువ్వు వద్దు, మా ఆఫీస్‌లో ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను’ అన్నాడు. చాలా ఏడ్చాను. కొన్ని రోజులకి మళ్లీ తనే కాల్‌ చేసి సారీ చెప్పాడు. ‘ఇద్దరం జాబ్‌ చేస్తేనే లైఫ్‌ బాగుంటుంది. నువ్వు కూడా జాబ్‌ ట్రై చెయ్యి’ అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. చాలా కష్టపడి ఓ మంచి జాబ్‌ సంపాదించాను. తర్వాత తనకి మరో మంచి జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ తను దాన్ని వదులుకున్నాడు. ఎందుకు అని అడిగితే.. ‘ఇప్పుడు నేను చేస్తున్న ఆఫీస్‌లో నాకో మంచి ఫ్రెండ్‌ ఉంది. తనని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. తనని నేను మిస్‌ అవ్వలేను’ అన్నాడు. తను చెబుతున్న ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. తన ఫ్రెండ్‌షిప్‌ కోసం మంచి జాబ్‌ వదిలేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘నీకు వచ్చిన జాబ్‌ నాకు నచ్చడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండలేను’ అంటున్నాడు. చాలా మంచి అబ్బాయి అన్నయ్యా. మేము చాలా బాగా ఉండేవాళ్లం. ఆ జాబ్‌ వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయాడు. ఇప్పటికీ తన మీద నాకు ప్రేమ పోవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – సౌమ్య

మంచోడా పాడా????ఒట్టి దగుల్బాజీ!!కుట్రకామకుడు..!‘అంటే ఏంటి సార్‌??’నాకూ తెలియదు నీలూ..! ఒక దొంగ రాజకీయ నాయకుడి గురించి ఎవరో మంచోడు అంటుంటే విన్నాను. నేను అనేశాను.కుట్రకామకుడు, ఏబ్రాసి...అబద్ధాల కోరు...మోసాల దిబ్బ...వెన్నుపోటుదారుడు...ఐరన్‌ లెగ్‌...చీటర్‌ కాక్‌...యాక్‌ తూ ఫెలో...సెల్ఫిష్‌ ధార్ది ఎంకమ్మ....................‘సార్‌..! ఇదంతా ఏదో రాజకీయ దుర్మార్గుడిని అన్నట్లుంది సార్‌!’వాడేమైనా తక్కువా నీలూ! విశ్వాసం లేని అక్కుపక్షి..!రోజుకో మాట మార్చే పెంటగాడు...!ఎప్పుడు ఎవరితో కనెక్షన్‌ పెట్టుకుంటాడో తెలియని యాగీగాడు...!!‘అంటే ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలియని పొలిటీషియన్‌ లాటి వాడా సార్‌..??’కరెక్ట్‌గా గెస్‌ చేశావు నీలూ..! మన అమ్మాయి లక్కీ. ఇంకా పొత్తు ఫైనల్‌ కాలేదు. అయ్యుంటే లైఫ్‌ మటాష్‌ అయ్యేది..!!‘అంటే ఫసక్‌ అయ్యేదా సార్‌?’ అబ్బబ్బబ్బా... నువ్వు ఎంత స్మార్ట్‌ నీలూ!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పచ్చడి పచ్చడి చేయండి

హెల్త్‌టిప్స్‌

ఈవెనింగ్‌ సినిమా

డాడీ లాంటి గర్ల్‌ఫ్రెండ్‌

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా? 

అనితరసాధ్యం

చెంగు పలాజో 

ఓటొచ్చిన వేళా విశేషం

ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..!

ఏడ దాగున్నాడో బావ?

సిరి గానుగ

‘కోట’ను కాపాడిన తెరవెనుక శక్తి

మనసు పరిమళించెను తనువు పరవశించెను

‘నేనూ చౌకీదార్‌నే!’

రాముడు – రాకాసి

అమ్మ వదిలేస్తే..!

అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?

క్యాన్సర్‌... వైద్యపరీక్షలు

సన్‌దడ 

సీఐడీలకే డాడీ!

నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది!

ముద్దమందారం పార్వతి

సిగనిగలు

మీరు బాగుండాలి

నన్నడగొద్దు ప్లీజ్‌ 

కిలకిల మువ్వల కేళీ కృష్ణా!

చొరవ చూపండి సమానత్వం వస్తుంది

వద్దంటే వద్దనే

30 నుంచి బెంగళూరులో కిసాన్‌ మేళా, దేశీ విత్తనోత్సవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చప్పక్‌ మొదలు

పాంచ్‌ పటకా

నవ్వుల కూలీ!

టబు వస్తున్నారా?

హ్యాపీ హనీమూన్‌

ప్రేమ..ప్రతీకారం