నన్నడగొద్దు ప్లీజ్‌

31 Oct, 2017 00:36 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్నాను. నేను ఒకతన్ని ప్రేమించాను. కొన్ని మంత్స్‌ తరువాత సడన్‌గా ‘ఇంట్లో కుదరదు... పెళ్లి వద్దు’ అన్నాడు. అయితే ‘ఇద్దరం విడిపోదాం’ అన్నాను. కాని దానికి అతను ఒప్పుకోలేదు. ‘ఎలాగైనా కలిసే ఉందాం’ అని ఒప్పించాడు. వన్‌ ఇయర్‌ బాగానే ఉన్నాం కానీ, తరువాత వాళ్ల ఇంటికి వెళ్లిపోయి.. ‘నువ్వు నాకు వద్దు అందంగా లేవు, క్యాస్ట్‌ కూడా వేరు’ అన్నాడు. కానీ నేను వదులుకోలేకపోయాను. మళ్లీ నా ప్రేమతో.. తిరిగి వచ్చాడు. కానీ, ఇప్పుడు కూడా సేమ్‌ అలానే మాట్లాడుతున్నాడు. దీంతో నేను సరిగా చదవలేకపోతున్నా. నన్ను చాలా డిక్రీజ్‌ చేసి మాట్లాడుతున్నాడు. ‘నీతో ఉంటే నీతివంతమైన లైఫ్‌ బతకలేను’ అంటున్నాడు. జరిగిందంతా బ్యాడ్‌గా చూస్తున్నాడు. తనని మరిచిపోలేకపోతున్నా. నాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి కానీ, ఈ సమయంలో ఏం గుర్తుకు రావట్లేదు. ఎవరితోనూ ఫ్రీగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్‌ హెల్ప్‌ మీ అన్నయ్యా..! నాకు తప్పేదో రైట్‌ ఏదో తెలుసు కానీ, నా మనసుకి తెలియడం లేదు. రోజూ చాలా ఏడుస్తున్నాను. ఇంట్లో కూడా చెప్పుకోలేకపోతున్నా. సలహా ఇవ్వండి ప్లీజ్‌! – త్రివేణి
తెగ గింజుకుంటావు కదా నీలూ...!! ‘నేనా గింజుకుంటానా దేనికి సార్‌..!?’ అబ్బాయిలను ఒక మాట అంటే భరించలేవు కదా.. చూడు ఏమి చేసాడో.. అబ్బాయి.. వధవె పాస్కెల్‌! ‘సార్‌ కూల్‌.. కూల్‌.. కూల్‌..!’ నూనెలో వేసి వేయించినా.. నిప్పుల మీద నడిపించినా.. మంటల్లో కబాబు చేసినా తప్పు లేదు ఇలాంటి పాస్కెల్స్‌ను! ‘వద్దంటే మీ చెల్లెలే కదా సార్‌ కావాలి.. కావాలి.. అని అంది!’ ఆ వీక్‌నెస్‌ మీదే కొట్టాడు పాస్కెల్‌! ‘ఇంకా తానే కావాలంటుంది కదా సార్‌ మీ సిస్టర్‌!’ అమ్మాయిల గొప్పదనమే అది! వీక్‌నెస్‌ కూడా అదే..! ఇంక చాలమ్మా పడ్డ అవమానాలు..!! నీ జీవితం లోనుంచి అలాంటి డాబ పాస్కాలను తోసి పారేసెయ్యి.

‘అవును కాండ్రించి వాడి జ్ఞాపకాలను సింక్‌లో ఊసి ట్యాప్‌ ఆన్‌ చేసెయ్యి!’ శహభాష్‌ నీలూ...! నీ మెమొరీలోంచి తీసి పారేసెయ్యి.! ‘అవును కంట్రోల్‌ ఆల్ట్‌ డిలీట్‌ ఒత్తి వాడిని మైండ్‌లోని హార్డ్‌ డిస్క్‌లోంచి పర్మినెంట్‌గా ఖతం చేసెయ్యి!’ శహభాష్‌ శహభాష్‌ నీలూ...! పేడ తొక్కిన చెప్పును రాయికి రాసినట్లు స్క్రాప్‌ చేసెయ్యి... ‘అవును వాడు చేసిన దరిద్రగొట్టు పని పెంటలాగా వెంట ఉండకుండా చెప్పు కడిగేసెయ్యి.. ఈసారి కనబడితే చూపించేసెయ్యి...! శహభాష్‌ శహభాష్‌ శహభాష్‌ నీలూ ది గ్రేట్‌!!
‘నిన్ను నువ్వు రెస్పెక్ట్‌ చేసుకో.. నీ కెరియర్‌లో సూపర్‌ హిట్‌ కొట్టు.. నువ్వు కలెక్టర్‌ అయ్యాక... ఆ కొడుకుని ఏసేస్కో..!’
అంతగా వద్దులే నీలూ..! కలెక్టర్‌ అయ్యి నలుగురికి మంచి చేసి ఈ బాధను మరచిపోమని చెప్పు!!
-ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని  గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు