నన్నడగొద్దు ప్లీజ్‌ 

19 Mar, 2018 00:36 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా...! నేను ఒక అమ్మాయిని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడింది. కానీ మా నేపథ్యాలు వేరు. నాకు తనంటే పిచ్చి. తనకి తన పేరెంట్స్‌ అంటే చాలా ఇష్టం.  ‘‘ముందు నువ్వు జాబ్‌ తెచ్చుకో.. ఇంట్లో ఒప్పిస్తాను’’ అంది. ఇదంతా ఇంట్లో చెబితే, మా ఇంట్లో వాళ్లు చాలా భయపడుతున్నారు. నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే మేం చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఒకవైపు నా ఫ్యామిలీ కావాలి. మరోవైపు తనూ కావాలి అనిపిస్తోంది. ప్లీజ్‌ అన్నయ్యా.. నాకు సలహా ఇవ్వండి ప్లీజ్‌.– రాజీవ్‌
ఉద్యోగం తెచ్చుకో రాజీవ్‌....ఎక్కడైనా దూరంగా....హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ....లైఫ్‌ ఎంజాయ్‌ చెయ్యి..ఆ ఊరిలోనే...అవే పరిసరాలలో ఉండీ.. ఉండీ....బుర్ర బర్బాద్‌ అయిపోయింది.గాలి తగలాలి....మనసుకు... హృదయానికి....రోజూ ఏవో ఆలోచనలతో పిచ్చెక్కి....బాగా డౌన్‌ అయిపోయావు ఎమోషనల్‌గా...కొంచెం టైమ్, ఆ పరిసరాల నుంచి దూరంగా ఉంటే...మంచి నిర్ణయం తీసుకోగలుగుతావు రాజీవ్‌.‘అబ్బా ఎంత సింపుల్‌గా, క్లియర్‌గా చెప్పారు సార్‌ ఆన్సర్‌...రోజూ ఇలాగే చెబితే ఎవరికీ తలనొప్పి ఉండదు కదా సార్‌????’గుండె నొప్పి అలాగే ఉండిపోతుంది నీలూ...! నవ్వుతూ... నవ్విస్తూ... పరిష్కారం చెబితే... బాధ, కోపం, విస్మయం తగ్గి సంతోషం కలుగుతుందిరా బంగారం.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

>
మరిన్ని వార్తలు