నన్నడగొద్దు ప్లీజ్‌ 

20 Mar, 2018 01:02 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా...! నేను మీకు రాయడం రెండో సారి. అప్పుడు మా ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడం లేదంటే ముందు జాబ్‌ వచ్చాక ఇంట్లో ఒప్పించు అన్నారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చింది. అయినా ఒప్పుకోవడం లేదు. కులాలు వేరుకావడంతో మా నాన్న  ఆ అమ్మాయిని చేసుకుంటే చచ్చిపోతా అంటున్నారు. అమ్మాయి నన్ను విడిచి ఉండలేదు. తను లేకుండా నేనూ బతకలేను. ఇద్దరం విడిపోయి మాత్రం ఉండలేం. వీళ్లని కాదని వెళ్లి కలిసి బతకాలా? లేక ఇద్దరం కలిసి చావాలా అర్థం కావడం లేదు. అన్నయ్యా ఏం చెయ్యను? – తేజ
ప్రేమ ఊపిరి అయినప్పుడు... చావు ఆలోచన ఎలా వస్తుందన్నా???ప్రేమ కోసం జీవించాలి.జీవితాన్ని ప్రేమించాలి.దూరంగా ఉన్న...ఎంత దూరంగా ఉన్నా...నేనున్నానన్న భరోసాతో బతికించాలి.చావు అంటావేంటి అన్నా..?ప్రతి పిరికివాడు...ప్రతి ఓడిపోయిన వాడు...ప్రతి అసమర్థుడు....ప్రతి అప్రేమికుడూ....‘అప్రేమికుడు అంటే ఏంటి సార్‌???’ప్రేమించానని చెప్పి ప్రేమకు, ప్రియురాలికి వ్యాల్యూ ఇవ్వనివాడు – అప్రేమికుడు.తేజ అలాంటి వాడు కాదు.‘అవును సార్‌ సిన్సియర్‌ లవర్‌ సార్‌...అమ్మాయి కోసం బతుకుతాడు...అమ్మాయిని బతికించుకుంటాడు...ప్రేమనూ బతికించుకుంటాడు సార్‌...’ అవును తేజ, కొంచెం టైమ్‌ ఇవ్వు. పెద్దలు అర్థం చేసుకుంటారు... బ్లెస్‌ యు!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు